తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli On Goat Of Ipl: ఐపీఎల్లో కోహ్లి గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరో తెలుసా.. ఒక్కరు కాదు ఇద్దరు

Virat Kohli on GOAT of IPL: ఐపీఎల్లో కోహ్లి గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరో తెలుసా.. ఒక్కరు కాదు ఇద్దరు

Hari Prasad S HT Telugu

20 April 2023, 19:08 IST

google News
    • Virat Kohli on GOAT of IPL: ఐపీఎల్లో కోహ్లి గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరో తెలుసా? నిజానికి అతడు ఒక్కరిని కాదు ఇద్దరిని ఎంపిక చేశాడు. అందులో ధోనీ పేరు మాత్రం లేదు.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (PTI)

విరాట్ కోహ్లి

Virat Kohli on GOAT of IPL: ఐపీఎల్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) ఎవరు? ఈ ప్రశ్న అడగ్గానే చాలా మంది అభిమానులు ఎమ్మెస్ ధోనీ, క్రిస్ గేల్, సురేశ్ రైనా, రోహిత్ శర్మలాంటి వాళ్ల పేర్లు చెప్పడం కామన్. కానీ ఆర్సీబీ ప్లేయర్, ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లి జాబితాలో మాత్రం వీళ్లెవరూ లేరు. అంతేకాదు కోహ్లి ప్రకారం.. అలాంటి ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు.

నిజానికి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎవరు అన్నది చెప్పడం చాలా కష్టమని, అయితే తన వరకూ అలాంటి ప్లేయర్స్ ఒక్కరు కాదు ఇద్దరని అతడు చెప్పాడు. ఆ ప్లేయర్స్ ఎవరో కాదు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్, కోహ్లి బెస్ట్ ఫ్రెండ్ అయిన ఏబీ డివిలియర్స్ ఒకరు కాగా.. లసిత్ మలింగ మరో ప్లేయర్. నిజానికి కోహ్లి చాయిస్ కూడా కరెక్టే అని చెప్పాలి.

ఐపీఎల్ పై ఈ ఇద్దరు ప్లేయర్స్ తమదైన ముద్ర వేశారు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన డివిలియర్స్.. ఆర్సీబీ తరఫున ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్, గేల్ తో కలిసి ఆర్సీబీని గెలిపించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. డివిలియర్స్ ఐపీఎల్లో 150కిపైగా స్ట్రైక్ రేట్ తో 5162 రన్స్ చేశాడు.

ఇక లసిత్ మలింగ కూడా ఐపీఎల్ చూసిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. తన చిత్రమైన బౌలింగ్ యాక్షన్, స్పీడ్, యార్కర్లు వేసే సామర్థ్యం అంతర్జాతీయ క్రికెట్ లోనే కాదు ఐపీఎల్లోనూ మలింగను ప్రత్యేకంగా నిలిపాయి. అతడు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను ఎన్నోసార్లు గెలిపించాడు.

తదుపరి వ్యాసం