తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Best Meddle Order Batters: ఈ ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లు.. టీమిండియాలో చోటు కోసం ఎదురుచూపులు

Best Meddle Order Batters: ఈ ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లు.. టీమిండియాలో చోటు కోసం ఎదురుచూపులు

21 May 2023, 18:15 IST

    • Best Middle Order Batters: ఈ ఐపీఎల్‌లో కొంతమంది మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్లు టీమిండియాలో అరంగేట్రం చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారిలో టాప్ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
ఆయుష్ బదోనీ-రింకూ సింగ్-తిలక్ వర్మ
ఆయుష్ బదోనీ-రింకూ సింగ్-తిలక్ వర్మ

ఆయుష్ బదోనీ-రింకూ సింగ్-తిలక్ వర్మ

Best Middle Order Batters: ఐపీఎల్ 2023 సీజన్ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు కూడా ఖరార అయ్యాయి. ఇక మిగిలింది ఎలిమినేటర్, క్వాలిఫయర్, ఫైనల్ మ్యాచ్‌లే. అయితే గత సీజన్‌లకు భిన్నంగా ఈ సారి చాలా ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు జరిగాయి. అంతేకాకుండా టీమిండియాలో చోటు కోసం యువ ఆటగాళ్ల తీవ్రంగా కృషి చేశారు. తమదైన ప్రదర్శనతో చోటు కోసం తీవ్ర పోటీని సృష్టించారు. యశస్వీ జైస్వాల్ లాంటి యువ ఆటగాడు 14 మ్యాచ్‍‌ల్లో 625 పరుగులతో అదరగొట్టాడు. జైస్వాల్‌తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు భారత జట్టులో మిడిల్ ఆర్డర్‌లో ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు. అందరూ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో సెలక్టర్లకు ఈ విషయంలో తలలు పట్టుకోవాల్సిందే. కేవలం ఐపీఎల్‌లోనే కాదు 2022-23 దేశవాళీ సీజన్‌లో వీరు అదరగొట్టారు. ఈ నేపథ్యంలో టీమిండియాలో చోటు కోసం చూస్తున్న టాప్ మిడిల్ ఆర్డర్ అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

జితేశ్ శర్మ..

పంజాబ్ బ్యాటర్ జితేశ్ శర్మ ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 155.88 స్ట్రైక్ రేటుతో 265 పరుగులు చేశాడు. ఫలితంగా తన బ్యాటింగ్ శైలితో అభిమానుల మద్దతు చూరగొన్నాడు. ముఖ్యంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడినప్పటికీ 27 బంతుల్లో 49 పరుగులతో ఆకట్టుకున్నాడు జితేశ్. కెవిన్ పీటర్సన్ లాంటి మాజీలు సైతం అతడిని టీమిండియాలో తీసుకోవాలని ఆకాంక్షించారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇతడు.. రిషబ్ పంత్‌ను భర్తీ చేసే అవకాశాలున్నాయి. టీ20ల్లో 84 మ్యాచ్‌లు ఆడిన జితేశ్ 2052 పరుగులు చేశాడు.

ఆయూష్ బదోనీ..

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున 23 ఏళ్ల ఆయుష్ బదోనీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అత్యుత్తమంగా ఆడాడు. ముఖ్యంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 59 పరుగులతో విజృంభించాడు. టీ20ల్లో 39 మ్యాచ్‌ల్లో 506 పరుగులు చేశాడు. అంతేకాకుండా రంజీల్లో రాణించాడు. మొత్తంగా 231 పరుగులు చేశాడు. మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆయూష్ బదోనీ టీమిండియాలో చోటు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

రింకూ సింగ్..

ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యాటర్ రింకూ సింగ్. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుత ప్రద్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా.. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాకుండా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 474 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇంక దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 335 పరుగులు, 8 ఇన్నింగ్స్‌ల్లో 442 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా మిడిల్ ఆర్డర్‌లో ఫినిషర్ రోల్ పోషించడానికి రింకూ సింగ్ టీమిండియాకు మంచి ఆప్షన్‌గా మారాడు.

తిలక్ వర్మ..

ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు ఐపీఎల్ 2023లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 20 ఏళ్లు ఈ తెలుగు తేజం అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 9 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 45.67 సగటుతో 158.38 స్ట్రైక్ రేటుతో 274 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధశతకం కూడా ఉంది. అలాగే దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతడు రెండు సెంచరీలు చేయడమే కాకుండా మొత్తంగా 402 పరుగులు సాధించాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో నాలుగు అర్ధశతకాలు సహా 297 పరుగులు సాధించాడు.