IPL 2022 | తొలి మ్యాచ్ లోనే అరుదైన రికార్డులు నెలకొల్పిన ఆయుష్ బదోని
సోమవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు లక్నో అటగాడు ఆయుష్ బదోని. తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ సాధించి రికార్డులు సృష్టించాడు. ఆ రికార్డులు ఏమిటంటే...
సోమవారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో ఆటగాడు ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ తోనే ఐపీఎల్ లో అడుగుపెట్టిన అతడు సొగసైన షాట్లతో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లక్నో జట్టును హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 41 బాల్స్ లో 54 పరుగులు చేసిఔటయ్యాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన తొమ్మిదో ఆటగాడిగా ఆయుష్ బదోని నిలిచాడు. అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగా చరిత్రను సృష్టించాడు.ఐపీఎల్ హిస్టరీలో ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగి హాఫ్ సెంచరీ సాధించిన తొలి అటగాడు బదోనినే కావడం గమనార్హం. ఒకే మ్యాచ్ లో మూడు రికార్డులు సాధించి బదోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
గుజరాత్ ఆటగాళ్లు రాహుల్ తెవాతియా, డేవిడ్ మిల్లర్ మెరుపు బ్యాటింగ్ కారణంగా బదోని ఇన్నింగ్స్ వృథా అయ్యింది. ఈ మ్యాచ్ లో లక్నోపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే ఈ మ్యాచ్ లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఐపీఎల్ కెరీర్ లో అతడు డకౌట్ కావడం ఇది రెండో సారి మాత్రమే. గతంలో గుజరాత్ లయన్స్ జట్టుపై అతడు డకౌట్ అవ్వడం గమనార్హం.
టాపిక్