తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Mi: చెన్నై-ముంబయి పోరుకు సర్వం సిద్ధం.. బ్యాటులు రువ్వుతున్న రోహిత్-ధోనీ

CSK vs MI: చెన్నై-ముంబయి పోరుకు సర్వం సిద్ధం.. బ్యాటులు రువ్వుతున్న రోహిత్-ధోనీ

05 May 2023, 21:55 IST

google News
    • CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇడియన్స్ మధ్య శనివారం నాడు చెపాక్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ గేమ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ఇరువురు కెప్టెన్లు ధోనీ, రోహిత్ నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు.
నెట్ ప్రాక్టీసులో ధోనీ-రోహిత్
నెట్ ప్రాక్టీసులో ధోనీ-రోహిత్

నెట్ ప్రాక్టీసులో ధోనీ-రోహిత్

CSK vs MI: ఐపీఎల్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా.. చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య పోరు రసవత్తరంగా ఉంటుంది. ఇరుజట్ల అభిమానులే కాకుండా సగటు క్రికెట్ ప్రేక్షకుడు కూడా ఆత్రుతగా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ఇరు జట్లు ముఖా ముఖి తలపడ్డాయి. ఇప్పటికే గత నెల 8న జరిగిన మ్యాచ్‍‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగా.. మరో లీగ్ మ్యాచ్ కోసం ఇరుజట్లు అభిమానులు చూస్తున్నారు. శనివారం నాడు చెన్నై-ముంబయి మరోసారి తలపడనున్నాయి. దీంతో ఇరు వర్గాల ఆటగాళ్లు తమ అస్త్రాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యంగా సారథులైన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.

చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఆటగాళ్లు ఇప్పటికే వేదికకు చేరుకున్నారు. ఇందులో భాగంగా ధోనీ నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. మరోపక్క రోహిత్ కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తూ సన్నాహంలో మునిగిపోయాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత మూడు మ్యాచ్‌ల్లో విజయం దక్కకపోవడంతో చెన్నై గెలుపు కోసం తీవ్రంగా ఎదురుచూస్తోంది. మరోపక్క భారీ లక్ష్యాలను ఛేదించి ఆత్మవిశ్వాసంతో ముంబయి బరిలోకి దిగుతోంది. దీంతో చెపాక్ వేదికగా ఇరుజట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

చెన్నై-ముంబయి పాయింట్ల వత్యాసం కూడా తక్కువగానే ఉంది. చెన్నై 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ముంబయి 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. చెన్నైపై ఆధిపత్యం చెలాయించాలంటే ముంబయికి ఈ విజయం అవసరం. మరోపక్క పాయింట్ల పట్టికలో మరో అడుగు ముందుకేయాలని చెన్నై కూడా చూస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఏది విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

తదుపరి వ్యాసం