Naveen with Dhoni: కోహ్లితో అలా.. ధోనీతో ఇలా.. నవీనుల్ ఫొటోలు వైరల్-naveen with dhoni photo gone viral after his fight with kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Naveen With Dhoni: కోహ్లితో అలా.. ధోనీతో ఇలా.. నవీనుల్ ఫొటోలు వైరల్

Naveen with Dhoni: కోహ్లితో అలా.. ధోనీతో ఇలా.. నవీనుల్ ఫొటోలు వైరల్

Hari Prasad S HT Telugu
May 04, 2023 08:02 PM IST

Naveen with Dhoni: కోహ్లితో అలా.. ధోనీతో ఇలా.. అంటూ నవీనుల్ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆప్ఘనిస్థాన్ ప్లేయర్ ఐపీఎల్లో పదే పదే వార్తల్లో నిలుస్తున్నాడు.

కోహ్లి, ధోనీతో నవీనుల్ హక్
కోహ్లి, ధోనీతో నవీనుల్ హక్

Naveen with Dhoni: కోహ్లితో నవీనుల్ హక్ గొడవ ఎక్కడి వరకూ వెళ్లిందో మనం చూశాం. అయితే ఇప్పుడదే నవీన్.. ధోనీతో మాత్రం ఓ అభిమానిలాగా ఫొటో దిగి మురిసిపోయాడు. ఈ రెండు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కోహ్లితో అలా.. ధోనీతో ఇలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

yearly horoscope entry point

ఐపీఎల్లో భాగంగా ఆర్సీబీ, ఎల్ఎస్‌‌జీ మధ్య మ్యాచ్ లో విరాట్ కోహ్లి, నవీనుల్ హక్.. తర్వాత కోహ్లి, గంభీర్ మధ్య గొడవ జరిగిన విషయం తెలుసు కదా. మ్యాచ్ సందర్భంగా హ్యాండ్‌షేక్ చేస్తూ కోహ్లి, నవీనుల్ సీరియస్ గా ఒకరినొకరు చూసుకుంటున్న ఫొటో మొదట వైరల్ అయింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ ఇన్‌స్టా పోస్టుల ద్వారా కూడా తిట్టుకున్నారు.

అయితే తాజాగా లక్నో, చెన్నై మ్యాచ్ సందర్భంగా ధోనీని కలిసిన నవీనుల్ హక్ అతనితో నవ్వుతూ ఫొటో దిగాడు. ఈ రెండు ఫొటోలు చూస్తుంటే నవీన్ ఈ ఇద్దరి ప్లేయర్స్ తో ఎంత భిన్నంగా వ్యవహరించాడో అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు. ఈ ఫొటోలు కోహ్లి, ధోనీ అభిమానుల మధ్య కూడా గొడవకు కారణం కాగా.. రెండు వేర్వేరు సందర్భాలకు చెందిన ఫొటోలను పోల్చడం సరికాదని మరికొందరు సర్ది చెబుతున్నారు.

కోహ్లి అభిమానులు అతనితో అవేష్ ఖాన్ దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఇదే అవేష్ ఖాన్ ధోనీతో ఎలా వ్యవహరించాడో చూడండి అంటూ ఆ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. కోహ్లితో అవేష్ చెట్టాపట్టాలేసుకొని హ్యాపీగా ఫొటో దిగగా.. ధోనీతో మాత్రం జేబుల్లో చేతులు పెట్టుకొని అసలు సీనియర్ అన్న పట్టింపు లేకుండా దిగినట్లు కనిపిస్తోంది.

అయితే నవీనుల్ హక్ మాత్రం ఈ గొడవపై తన తీరును విస్పష్టంగా చెప్పేశాడు. తాను ఇక్కడికి ఐపీఎల్ ఆడటానికి వచ్చాను తప్ప తిట్లు తినడానికి కాదని, తానెవరితోనూ మాటలు పడనని అతడు తేల్చి చెప్పాడు.

Whats_app_banner

సంబంధిత కథనం