Virat Kohli Instagram: క్రికెట్ రియల్ బాస్ అతడే అట.. కోహ్లి పోస్ట్ వైరల్-virat kohli instagram post viral as he reveals about real boss ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Instagram Post Viral As He Reveals About Real Boss

Virat Kohli Instagram: క్రికెట్ రియల్ బాస్ అతడే అట.. కోహ్లి పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu
May 04, 2023 01:47 PM IST

Virat Kohli Instagram: క్రికెట్ రియల్ బాస్ అతడే అట. కోహ్లి పోస్ట్ వైరల్ అవుతోంది. గౌతమ్ గంభీర్ తో ఫైట్ ద్వారా వార్తల్లో నిలిచిన అతడు.. ఇప్పుడీ పోస్ట్ తో మరోసారి చర్చకు తెరలేపాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AFP)

Virat Kohli Instagram: క్రికెట్ రియల్ బాస్ ఎవరు? క్రికెట్ ను శాసించిన ఎంతో మంది ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఇండియా నుంచి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోనీలాంటి ప్లేయర్స్ చెరగని ముద్ర వేశారు. అయితే విరాట్ కోహ్లి ప్రకారం క్రికెట్ రియల్ బాస్ మాత్రం వీళ్లలో ఎవరూ కాదట. తాజాగా కోహ్లి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

కోహ్లి అభిప్రాయం ప్రకారం క్రికెట్ రియల్ బాస్.. వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ అట. రిచర్డ్స్ కు చెందిన పాత ఇంటర్వ్యూను తిరిగి పోస్ట్ చేస్తూ ది రియల్ బాస్ అని విరాట్ అన్నాడు. ఆ ఇంటర్వ్యూలో రిచర్డ్స్ టీ20 క్రికెట్ లీగ్ పై స్పందించాడు. తన కాలంలో ఐపీఎల్ లాంటి టీ20 లీగ్ ఉండి ఉంటే తాను కచ్చితంగా ఆడేవాడినని ఆ ఇంటర్వ్యూలో వివ్ అన్నాడు.

ఐదు రోజుల పాటు సాగి డ్రా అయ్యే టెస్టులు, వన్డేలు కూడా 60 ఓవర్లపాటు సాగే రోజుల్లోనే వివ్ రిచర్డ్స్.. దూకుడైన క్రికెట్ ఆడేవాడు. ఇప్పుడంతా బౌలర్లను చితకబాదే బ్యాటర్లే కదా. అయితే మూడు, నాలుగు దశాబ్దాల కిందటే అలా బంతిని బలంగా బాదే అలవాటు రిచర్డ్స్ కు ఉండేది. నిజానికి టీ20 ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే ఆటతీరు అతని సొంతం.

దీంతో ఈ ఫార్మాట్ పై సహజంగానే అతడు మనసు పారేసుకున్నాడు. టెస్టుల్లోనే వివ్ రిచర్డ్స్ స్ట్రైక్ రేట్ 86.07గా ఉందంటే అతని ఆట ఎలా సాగేదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ కాలంలో ఈ ఐపీఎల్ లేదా సీపీఎల్ లాంటివి ఉంటే తాను ఆడటానికి ఎంతో ఇష్టపడేవాడినని ఆ ఇంటర్వ్యూలో రిచర్డ్స్ చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం