Sehwag on Dhoni Retirement: ఎందుకు అడుగుతున్నారు? ధోనీ రిటైర్మెంట్‌పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు
Sehwag on Dhoni Retirement: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎలా? అనే ప్రశ్నను టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తప్పుపట్టారు. పదే పదే ఆ ప్ఱశ్నను ఎందుకు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు.
Sehwag on Dhoni Retirement: కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని సర్వత్రా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ధోనీ కూడా స్పందించి క్లారిటీనిచ్చారు. బుధవారం నాడు లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా మీకు ఇదే చివరి ఐపీఎల్ అనుకుంటా అని మహీని అడుగ్గా.. అది మీరు డిసైడ్ అయ్యారు నేను కాదు.. అంటూ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తుంటే వచ్చే సీజన్‌లోనూ ఆడతాడని పరోక్షంగా తెలియజేశారు. ఇదిలా ఉంటే ధోనీని పదే పదే రిటైర్మెంట్ గురించి అడగడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టారు. ఎందుకు మహీని ఆ ప్రశ్న అడుగుతున్నారు? అని ప్రశ్నించారు.
"నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆ ప్రశ్న అడుగుతున్నారు? అతడికి(ధోనీ) ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు.. అంత మాత్రం ఓ ప్లేయర్‌ను ఎందుకు అడుగుతున్నారు? ఈ విషయంలో నిర్ణయం అతడిది. అతడిని తీసుకోనివ్వండి. ఈ ప్రశ్నకు సమాధానం నుంచి ధోనీ నుంచి రాబట్టుకుందామని అనుకోవచ్చు. కానీ ధోనీకి ఇది చివరిదో కాదో అతడికే మాత్రమే తెలుసు." అని సెహ్వాగ్ అన్నారు.
బుధవారం నాడు లక్నో-చెన్నై మ్యాచ్ సందర్భంగా హోస్ట్ డానీ మోరిసన్.. ధోనీ రిటైర్మెంట్ గురించి అడిగారు. ఇదే చివరి సీజన్ కదా.. ఎలా అనిపిస్తోంది అని అనగా.. ఇందుకు మహీ స్పందిస్తూ.. ఇదే చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు అని బదులిచ్చాడు. అయితే వచ్చే ఏడాది కూడా ఆడాతావన్నమాట.. అని వచ్చే ఏడాది కూడా ధోనీ వస్తాడట అంటూ అభిమానులకు చెప్పాడు. అతని మాటలు విని మన కెప్టెన్ కూల్ చిరునవ్వ చిందించాడు తప్ప.. కచ్చితంగా దానికి అవును లేదా కాదు అని చెప్పలేదు.
లక్నో సూపర్ జెయింట్స్-చెన్నై సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19.2 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఇంతలో వర్షం రావడంతో మ్యాచ్ చాలా సేపు ఆగిపోయింది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో ఫలితం తేలలేదు. దీంతో చెన్నై, లక్నో జట్టుకు చెరో పాయింట్ లభించింది.
సంబంధిత కథనం