తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: హైదరాబాద్‌పై విజయంతో ముంబయి స్థానమిదే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో వచ్చిన మార్పులివే..!

IPL 2023 Points Table: హైదరాబాద్‌పై విజయంతో ముంబయి స్థానమిదే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లో వచ్చిన మార్పులివే..!

19 April 2023, 8:56 IST

google News
    • IPL 2023 Points Table: మంగళవారం నాడు హైదరాబాద్‌పై ముంబయి విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు దూసుకెళ్లింది. మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో ఆరో స్థానానికి చేరింది. హైదరాబాద్‌ 9వ స్థానంలో నిలిచింది.
హైదరాబాద్-ముంబయి
హైదరాబాద్-ముంబయి (IPL Twitter)

హైదరాబాద్-ముంబయి

IPL 2023 Points Table: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం నాడు జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన ముంబయి వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. కేమరూన్ గ్రీన్ ముచ్చటైన ఇన్నింగ్స్‌తో రోహిత్ సేన అదిరిపోయే సక్సెస్‌ను సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ముంబయి ఆరో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయలతో 6 పాయింట్లు సాధించి మెరుగైన స్థితికి చేరుకుంది.

మరోపక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఓటమితో 9వ స్థానంలో నిలిచింది. ఇంతవరకు ఒక్క విజయాన్ని కూడా అందుకోని దిల్లీ క్యాపిటల్స్ అన్నింటికంటే దిగువన 10వ స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఐదింటిలో నాలుగు విజయాలతో 8 పాయింట్ల సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 3 విజయాలతో లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్..

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఐదు మ్యాచ్‌ల్లో 259 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత 234 పరుగులతో వెంకటేష్ అయ్యర్ రెండో ప్లేస్‌లో 233 పరుగులతో మూడో ప్లేస్‌లో శిఖర్ ధావన్ ఉన్నాడు. ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ ఐదు మ్యాచ్‌ల్లో 214 పరుగులతో 7వ స్థానానికి చేరాడు.

పర్పుల్ క్యాప్..

పర్పుల్ క్యాప్ విషయానికొస్తే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజువేంద్ర చాహల్ 11 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత మార్క్‌వుడ్(11), రషీద్ ఖాన్(11) ఉన్నారు. ముంబయి బౌలర్ పియూష్ చావ్లా 7 వికెట్లతో 9వ స్థానానికి చేరాడు.

ఈ మ్యాచ్‍‌‌లో హైదరాబాద్‌పై ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ చేసిన అర్జున్ తెందూల్కర్ కేవలం 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ హీరో హ్యారీ బ్రూక్(9), కెప్టెన్ మార్క్‌క్రమ్(22) తక్కువ పరుగులకే ఔట్ కావడంతో మ్యాచ్‌ను కోల్పోయింది హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు పియూష్ చావ్లా, రిలే మెరెడెత్, జేసన్ బెహ్రెండార్ఫ్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకుకోగా,.. అర్జున్ తెందూల్కర్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.

తదుపరి వ్యాసం