తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: పైకొచ్చిన ముంబయి.. దిగజారిన పంజాబ్.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ మార్పులివే

IPL 2023 Points Table: పైకొచ్చిన ముంబయి.. దిగజారిన పంజాబ్.. పర్పుల్-ఆరెంజ్ క్యాప్ మార్పులివే

04 May 2023, 8:11 IST

google News
    • IPL 2023 Points Table: పంజాబ్‌పై విజయం సాధించిన ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. 5 విజయలతో 10 పాయింట్లు అందుకున్న రోహిత్ సేన 6వ స్థానానికి ఎగబాకింది.
పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం
పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం (PTI)

పంజాబ్‌పై ముంబయి ఘనవిజయం

IPL 2023 Points Table: ఐపీఎల్ 2023లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. బుధవారం నాడు పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలిచింది. అంతేకాకుండా వరుసగా 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని రెండో సారి సాధించిన అరుదైన ఘనత అందుకుంది. పంజాబ్ వ్యూహాలను తుత్తునీయలు చేస్తూ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో రాణించారు. ఫలితంగా ముంబయి 5వ విజయాన్ని ఖతాలో వేసుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని కూడా మెరుగుపరచుకుంది.

పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన ముంబయి పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకుంది. 9 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించిన రోహిత్ సేన.. ఓ స్థానం మెరుగుపరచుకుంది. మరోపక్క పంజాబ్ ఈ పరాజయంతో ఓ స్థానం దిగజారి 8వ ప్లేసుకు చేరుకుంది. 6 విజయాలతో అగ్రస్థానంలో గుజరాత్ టైటాన్స్ కొనసాగుతుండగా.. 3 విజయాలతో దిల్లీ క్యాపిటల్స్ అన్నింటికంటే దిగువన ఉంది.

ఆరెంజ్ క్యాప్..

ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఆరెంజ్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. 9 మ్యాచ్‌ల్లో అతడు 466 పరుగులు చేశాడు. అతడి తర్వాత రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 428 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 424 పరుగులతో చెన్నై ప్లేయర్ డేవాన్ కాన్వే మూడో ప్లేస్‌లో ఉన్నాడు. 364 పరుగులతో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.

పర్పుల్ క్యాప్..

గుజరాత్ టైటాన్స్ పేసర్ అత్యధిక వికెట్లతో మహ్మద్ షమీ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అతడు 9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి తర్వాత తుషార్ దేశ్ పాండే కూడా 17 వికెట్లతోనే రెండో స్థానంలో నిలిచాడు. 16 వికెట్లతో అర్ష్‌దీప్ సింగ్ తదుపరి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత 15 వికెట్లతో పియూష్ చావ్లా, మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. 215 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఛేదించింది. మొత్తంగా 216 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబయి బ్యాటర్లు ఇషాన్ కిషన్(77), సూర్యకుమార్ యాదవ్(66) రాణించి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, రిషి ధావన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తదుపరి వ్యాసం