PBKS vs CSK: లాస్ట్ బాల్ థ్రిల్ల‌ర్ - పంజాబ్‌ను గెలిపించిన ర‌జా - చెన్నై జోరుకు బ్రేక్‌-pbks defeat csk by four wickets in last ball thriller ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pbks Vs Csk: లాస్ట్ బాల్ థ్రిల్ల‌ర్ - పంజాబ్‌ను గెలిపించిన ర‌జా - చెన్నై జోరుకు బ్రేక్‌

PBKS vs CSK: లాస్ట్ బాల్ థ్రిల్ల‌ర్ - పంజాబ్‌ను గెలిపించిన ర‌జా - చెన్నై జోరుకు బ్రేక్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 30, 2023 07:39 PM IST

PBKS vs CSK: చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ లాస్ట్‌ బాల్ వ‌ర‌కు క్రికెట్ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ‌ను రేకెత్తించింది. చివ‌రి బాల్‌కు మూడు ర‌న్స్ తీసి పంజాబ్‌ను సికింద‌ర్ ర‌జా గెలిపించాడు.

జితేన్ శ‌ర్మ
జితేన్ శ‌ర్మ

PBKS vs CSK: ఆదివారం చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ చివ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ‌ను పంచింది. లాస్ట్ బాల్‌కు మూడు ర‌న్స్ తీసి పంజాబ్‌ను సికింద‌ర్ ర‌జా గెలిపించాడు. చెన్నై విధించిన 201 ప‌రుగుల టార్గెట్ పంజాబ్ చివరి బాల్‌కు ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకున్న‌ది.

201 ప‌రుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ దిగిన పంజాబ్‌కు ప్ర‌భ్‌సిమ్రాన్‌, శిఖ‌ర్ ధావ‌న్ చ‌క్క‌టి ఆరంభాన్ని అందించారు. ప్ర‌భ్ సిమ్రాన్ 24 బాల్స్‌లో నాలుగు ఫోర్లు రెండు సిక్స‌ర్ల‌తో 42 ర‌న్స్ చేయ‌గా… ధావ‌న్ 15 బాల్స్‌లో నాలుగు ఫోర్లు ఓ సిక్స‌ర్‌తో 28 ర‌న్స్ చేశాడు. ధాటిగా ఆడుతోన్న వీరిద్ద‌రు ఔట్ కావ‌డంతో పంజాబ్ స్కోరు వేగం త‌గ్గింది.

తుషార్ దేశ్‌పాండే వేసిన ప‌ద‌హారో ఓవ‌ర్‌లో మూడు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 22 ర‌న్స్ చేసిన లివింగ్ స్టోన్ పంజాబ్‌ను తిరిగి గెలుపు రేసులోకి తీసుకొచ్చాడు. కానీ అదే ఓవ‌ర్‌లో అత‌డిని ఔట్ చేసి చెన్నైకి తుషార్ బ్రేక్ ఇచ్చాడు. 24 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు ఒక ఫోర్‌తో 40 ప‌రుగులు చేశాడు లివింగ్ స్టోన్‌.

ఆ త‌ర్వాత సామ్ క‌ర‌న్ (20 బాల్స్‌లో 29 ర‌న్స్‌) కూడా ఔట్ కావ‌డంతో మ్యాచ్‌పై చెన్నై ప‌ట్టుబిగించిన‌ట్లుగా క‌నిపించింది. జితేన్ శ‌ర్మ రెండు, ఫోర్లు ఓ సిక్సర్ కొట్టి జోరు మీద కనిపించాడు. కానీ అతడిని 19వ ఓవర్‌లో తుషార్ ఔట్ చేశాడు. పంజాబ్ గెలుపు కోసం ఆరు బాల్స్‌లో తొమ్మిది ర‌న్స్‌ చేయాల్సిరావడంతో మ్యాచ్ ఉత్కంఠ‌భ‌రితంగా మారింది.

చివరి ఓవర్ వేసిన పతిరన ఐదు బంతుల‌కు ఆరు ర‌న్స్ మాత్రమే ఇవ్వడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. చివ‌రి బాల్‌కు మూడు ర‌న్స్ చేసిన సికింద‌ర్ ర‌జా పంజాబ్‌కు మరచిపోలేని విజ‌యాన్ని అందించాడు.

చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే మూడు, ర‌వీంద్ర జ‌డేజా రెండు వికెట్లు తీసుకున్నారు. అంత‌కుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇర‌వై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ డేవాన్ కాన్వే 92 ప‌రుగుల‌తో రాణించాడు.

Whats_app_banner

టాపిక్