తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Ipl Record: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ, గేల్‌కు సాధ్యం కాని రికార్డుతో అరుదైన ఘనత

KL Rahul IPL Record: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ, గేల్‌కు సాధ్యం కాని రికార్డుతో అరుదైన ఘనత

15 April 2023, 21:44 IST

google News
    • KL Rahul IPL Record: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (AP)

కేఎల్ రాహుల్

KL Rahul IPL Record: పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ అద్భుత ఆటతీరుతో రాణించాడు. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాహుల్ అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతేకాకుండా మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు రాహుల్.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మార్కును అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ లాంటి మహామహులకు కూడా సాధ్యం కాని రికార్డును దక్కంచుకున్నాడు. కేఎల్ రాహుల్ ఈ ఘనతను కేవలం 105 ఇన్నింగ్సుల్లోనే అందుకోవడం విశేషం. ఫలితంగా అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయిని అందుకుని తొలి స్థానంలో నిలిచాడు. మొత్తంగా 4044 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి.

రాహుల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 112 ఇన్నింగ్స్‌ల్లో 4 వేల పరుగుల మార్కును అందుకోగా.. డేవిడ్ వార్నర్ 114 ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్నాడు. వార్నర్ తర్వాత విరాట్ కోహ్లీ 128 ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును కైవసం చేసుకోగా.. అతడి తర్వాత ఏబీ డివిలియర్స్ 131 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓ మోస్తరు పరుగులే చేయగలింగింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(74) అర్ధ సెంచరీతో విజృంభించడం మినహా లక్నో జట్టులో మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఓ మోస్తరు స్కోరుకే లక్నో పరిమితమైంది. మరోవైపు పంజాబ్ బౌలర్లలో కెప్టెన్ సామ్ కరన్ 3 వికెట్లతో ఆకట్టుకోగా.. రబాడా 2 వికెట్ల రాణించాడు.

తదుపరి వ్యాసం