Kl Rahul Ipl Records: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ పేరిట ఉన్న రికార్డులు ఏవో తెలుసా-ipl 2023 kl rahul records in ipl history ipl records ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kl Rahul Ipl Records: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ పేరిట ఉన్న రికార్డులు ఏవో తెలుసా

Kl Rahul Ipl Records: ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ పేరిట ఉన్న రికార్డులు ఏవో తెలుసా

Nelki Naresh Kumar HT Telugu
Mar 26, 2023 08:23 AM IST

Kl Rahul Ipl Records: ఐపీఎల్‌లో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్లేయ‌ర్స్‌లో ఒక‌డిగా పేరుతెచ్చుకున్నాడు కేఎల్ రాహుల్‌. ఐపీఎల్‌లో అత‌డి పేరిట ఉన్న రికార్డులు ఏవో తెలుసా...

కేఎల్ రాహుల్‌
కేఎల్ రాహుల్‌

Kl Rahul Ipl Records: ఐపీఎల్ ద్వారానే క్రికెట‌ర్‌గా కేఎల్ రాహుల్ (Kl Rahul )ప్ర‌తిభ వెలుగులోకి వ‌చ్చింది. ఐపీఎల్‌లో ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు రాహుల్‌. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 109 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 3889 ర‌న్స్ చేశాడు. గ‌త నాలుగు ఐపీఎల్ సీజ‌న్స్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్స్‌లో ఒక‌డిగా రాహుల్ నిలిచాడు. ఐపీఎల్ 2022లో 659 ర‌న్స్ చేసి ఆక‌ట్టుకున్నాడు.

ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు కేఎల్ రాహుల్‌. గ‌త కొంత‌కాలంగా ఫామ్ లేమీతో ఇబ్బందులు ప‌డుతోన్న రాహుల్ ఈ సీజ‌న్‌లో ఎలా ఆడుతాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఐపీఎల్‌లో రాహుల్ పేరిట అద్భుత‌మైన రికార్డులు ఉన్న నేప‌థ్యంలో మ‌రోసారి త‌న‌కు అచ్చొచ్చిన ఈ ఫార్మెట్ ద్వారానే ఫామ్ అందిపుచ్చుకోవాల‌ని అత‌డు భావిస్తోన్నాడు.

ఐపీఎల్‌లో రాహుల్ పేరున ఉన్న రికార్డులు ఏవంటే...

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ రికార్డ్ కేఎల్ రాహుల్ పేరు మీద ఉంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 14 బాల్స్‌లోనే రాహుల్ హాఫ్ సెంచ‌రీ మార్కును అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ రికార్డును అందుకున్న‌ ఏకైక ఇండియ‌న్ ప్లేయ‌ర్ అత‌డే. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ లిస్ట్‌లో రాహుల్‌తో పాటు ప్యాట్ క‌మిన్స్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. క‌మిన్స్ కూడా ముంబై ఇండియ‌న్స్‌పై 14 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

హ‌య్యెస్ట్ పార్ట్‌న‌ర్‌షిప్‌

ఐపీఎల్‌లో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్ రికార్డ్ కేఎల్ రాహుల్‌, డికాక్ జోడీ పేరు మీద ఉంది. కోల్‌క‌తా నైట్ రైట‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ దిగిన రాహుల్‌, డికాక్ 210 ప‌రుగులు చేశారు. ఐపీఎల్‌లో తొలి వికెట్‌కు అత్య‌ధిక ప‌రుగుల పార్ట్‌న‌ర్‌షిప్‌ రికార్డ్ వీరిదే కావ‌డం గ‌మ‌నార్హం.

హ‌య్యెస్ట్ బ్యాటింగ్ యావ‌రేజ్‌

ఐపీఎల్‌లో అత్య‌ధిక యావ‌రేజ్ క‌లిగిన బ్యాట‌ర్‌గా కేఎల్ రాహుల్ ప‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. 109 మ్యాచుల్లో 48 యావ‌రేజ్‌తో 3889 ర‌న్స్ చేశాడు రాహుల్‌. అత‌డి త‌ర్వాత హాషీమ్ ఆమ్లా రెండో స్థానంలో ఉన్నాడు.

WhatsApp channel

టాపిక్