తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli On Rashid Catch : అద్భుతమైన క్యాచ్.. రషీద్​పై కోహ్లీ ప్రశంసలు

Kohli On Rashid Catch : అద్భుతమైన క్యాచ్.. రషీద్​పై కోహ్లీ ప్రశంసలు

Anand Sai HT Telugu

08 May 2023, 7:26 IST

    • Kohli On Rashid Catch : లక్నో సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్ మాత్రం అద్భుతం. రషీద్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రషీద్ ఖాన్ క్యాచ్ పై కోహ్లీ కామెంట్స్
రషీద్ ఖాన్ క్యాచ్ పై కోహ్లీ కామెంట్స్

రషీద్ ఖాన్ క్యాచ్ పై కోహ్లీ కామెంట్స్

IPL 2023 : ఐపీఎల్ 51వ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ అద్భుత క్యాచ్‌కి ఆర్‌సీబీ(RCB) ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిదా అయ్యాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలు గుజరాత్‌ టైటాన్స్‌కు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత సాహా (81) వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 25 పరుగులు చేశాడు. మరోవైపు భీకర బ్యాటింగ్‌ను ప్రదర్శించిన శుభ్‌మన్ గిల్ 51 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో అజేయంగా 94 పరుగులు చేశాడు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

228 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్‌(Lucknow Super Jaints)కు శుభారంభం లభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ కైల్ మేయర్స్, క్వింటన్ డి కాక్.. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చిత్తు చేశారు. దీంతో జట్టు మొత్తం 8 ఓవర్లలో 80 పరుగుల మార్కును దాటింది.

వికెట్ల అన్వేషణలో ఉన్న హార్దిక్ పాండ్యా(hardik pandya).. మోహిత్ శర్మకు బంతి ఇచ్చాడు. 9వ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ వైపు తిప్పాడు కైల్ మేయర్స్. కానీ అతి వేగంతో బౌండరీ లైన్ నుంచి పరుగెత్తుకొచ్చిన రషీద్ ఖాన్ డైవింగ్ క్యాచ్(Rashikd Khan Catch) పట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు క్యాచ్ అందుతుందని ఎవరూ ఊహించలేదు.

ఈ అద్భుతమైన క్యాచ్‌ని చూసి విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఇది నేను చూసిన అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటి అని చెప్పుకొచ్చాడు కోహ్లీ. రషీద్ ఖాన్ ఫీల్డింగ్‌ను కింగ్ కోహ్లీ 'బ్రిలియంట్' అని ప్రశంసించాడు. ఇప్పుడు రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ డైవింగ్ క్యాచ్ చూసి గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం