GT vs LSG | ప్లేఆఫ్స్‌లోకి గుజరాత్‌ టైటన్స్‌.. చిత్తుగా ఓడిన లక్నో-gujarat titans beat lucknow to confirm their playoffs berth in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gt Vs Lsg | ప్లేఆఫ్స్‌లోకి గుజరాత్‌ టైటన్స్‌.. చిత్తుగా ఓడిన లక్నో

GT vs LSG | ప్లేఆఫ్స్‌లోకి గుజరాత్‌ టైటన్స్‌.. చిత్తుగా ఓడిన లక్నో

Hari Prasad S HT Telugu
May 10, 2022 10:58 PM IST

ఐపీఎల్‌ 2022లో ప్లేఆఫ్స్‌లోకి వెళ్లిన తొలి టీమ్‌గా నిలిచింది గుజరాత్‌ టైటన్స్‌. మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించిన టైటన్స్‌.. టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లింది.

<p>ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన తొలి టీమ్ గుజరాత్ టైటన్స్</p>
<p>ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన తొలి టీమ్ గుజరాత్ టైటన్స్</p> (PTI)

పుణె: ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్స్‌ మధ్య జరిగిన ఫైట్‌లో మరోసారి గుజరాతే పైచేయి సాధించింది. తొలి ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం జరిగిన ఫైట్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది హార్దిక్‌ పాండ్యా సేన. గుజరాత్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో లక్నో బ్యాటర్లు చేతులెత్తేశారు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. 82 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న తొలి టీమ్‌గా కూడా నిలిచింది.

లక్నో స్టార్‌ బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు క్వింటన్‌ డీకాక్‌ (11), కేఎల్‌ రాహుల్‌ (8), కరణ్‌ శర్మ (4), కృనాల్‌ పాండ్యా (5), ఆయుష్‌ బదోనీ (8), మార్కస్‌ స్టాయినిస్‌ (2)లాంటి టాప్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీపక్‌ హుడా మాత్రమే 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3.5 ఓవర్లలో 24 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. యశ్‌ దయాల్‌, సాయి కిశోర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

12 మ్యాచ్‌లలో 9వ విజయంతో 18 పాయింట్లు సాధించిన గుజరాత్‌ టైటన్స్‌.. టాప్‌ ప్లేస్‌లో ఉంది. లక్నో సూపర్‌ జెయింట్స్ 12 మ్యాచ్‌లలో 8 విజయాలు, 4 పరాజయాలతో 16 పాయింట్లతో రెండోస్థానానికి దిగజారింది. ప్రస్తుతానికి గుజరాత్‌ మాత్రమే ప్లేఆఫ్స్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. మరో బెర్త్‌ల కోసం 8 టీమ్స్‌ మధ్య పోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే రేసు నుంచి తప్పుకుంది.

టాపిక్