తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Playoffs: ముంబై ఇండియన్స్‌కు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? వాళ్లు ఏం చేయాలి?

IPL 2023 Playoffs: ముంబై ఇండియన్స్‌కు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? వాళ్లు ఏం చేయాలి?

Hari Prasad S HT Telugu

17 May 2023, 8:19 IST

google News
    • IPL 2023 Playoffs: ముంబై ఇండియన్స్‌కు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా? ముందుడుగు వేయాలంటే వాళ్లు ఏం చేయాలి? లక్నో చేతుల్లో ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం మరికొన్ని రోజుల వేచి చూడాల్సి వస్తోంది.
ముంబై ఇండియన్స్ టీమ్
ముంబై ఇండియన్స్ టీమ్ (AFP)

ముంబై ఇండియన్స్ టీమ్

IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పుడు ప్రతి మ్యాచ్ ప్రతి జట్టుకూ కీలకమే. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ తమ ప్లేఆఫ్స్ అవకాశాలను కాస్త సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి ఓవర్లో బోల్తా పడి 5 పరుగుల తేడాతో ఓడిన ముంబై ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానానికి పడిపోయింది.

ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఆ టీమ్ రెండోస్థానానికి చేరేది. లక్నో నాలుగుకు పడిపోయేది. అయితే చివరి ఓవర్లో మోసిన్ ఖాన్ దెబ్బకు ఎంఐ ఓడిపోవడంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ఎంఐ ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి? చివరి మ్యాచ్ లోనూ ఓడినా ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా?

ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే..

ముంబై ఈ సీజన్ లో చివరి లీగ్ మ్యాచ్ వాంఖెడేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ముంబై ఇండియన్స్ నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటారు. ఈ విజయంతో ఆ టీమ్ 16 పాయింట్లకు చేరుతుంది. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తమ తర్వాతి రెండు మ్యాచ్ లలో ఒకదాంట్లో ఓడినా.. నెట్ రన్‌రేట్ చూడాల్సిన అవసరం కూడా రాదు.

అయితే ఎంఐ నెట్ రన్‌రేట్.. ఆర్సీబీతో పోలిస్తే తక్కువగా ఉంది. దీంతో సన్ రైజర్స్ పై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. పైగా ఆర్సీబీ తన చివరి మ్యాచ్ ను ఎంఐ చివరి మ్యాచ్ తర్వాత ఆడుతుంది. ఒకవేళ ఆర్సీబీ తన రెండు మ్యాచ్ లను గెలిస్తే మాత్రం ఆ టీమ్ 16 పాయింట్లతో, మెరుగైన నెట్ ‌రన్‌రేట్ తో నిలుస్తుంది. అందువల్ల ఆర్సీబీ గెలుపోటములతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ చేరాలంటే సన్ రైజర్స్ పై ముంబైకి భారీ విజయం అవసరం.

చివరి మ్యాచ్ లో ఓడిపోతే?

ఒకవేళ సన్ రైజర్స్ చేతుల్లోనూ ముంబై ఓడిపోతే ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుందా? దీనికి సమాధానం ఉంటుంది. అయితే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు తమ తర్వాతి రెండు మ్యాచ్ లలోనూ ఓడాలి. అంతేకాదు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా 14 పాయింట్లు అందుకునే అవకాశం ఉంది. వీటిలో అన్నింటి కంటే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. అందువల్ల ఇదంతా ఎందుకు అనుకుంటే మాత్రం సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించడం ఒక్కటే ఎంఐ ముందున్న మార్గం.

ఎంఐ టాప్ 2లో ఉంటుందా?

అంతేకాదు ముంబై ఇండియన్స్ ఇప్పటికే టాప్ 2లో నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అలా జరగాలంటే చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించడంతోపాటు సీఎస్కే, ఎల్ఎస్‌జీ తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోవాలి. మరోవైపు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తమ తర్వాతి రెండు మ్యాచ్ లలో గెలిచినా కూడా టాప్ 2లో నిలవాలంటే ముంబైకి మెరుగైన నెట్ రన్‌రేట్ అవసరం.

తదుపరి వ్యాసం