Gavaskar on Suryakumar: ఆర్సీబీతో గల్లీ క్రికెట్ ఆడేశాడు.. సూర్యపై గవాస్కర్ ప్రశంసల వర్షం
10 May 2023, 12:02 IST
- Gavaskar on Suryakumar: ఆర్సీబీతో గల్లీ క్రికెట్ ఆడేశాడు అంటూ సూర్యపై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు కంప్యూటర్ పై ఆడుతున్నట్లుగా అనిపిస్తుందని గంగూలీ కూడా అన్న విషయం తెలిసిందే.
సునీల్ గవాస్కర్, సూర్య కుమార్ యాదవ్
అది చూసిన గవాస్కర్.. స్కైపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్సీబీతో గల్లీ క్రికెట్ ఆడేశాడని అనడం విశేషం. ఇంతకుముందు గంగూలీ, విరాట్ కోహ్లిలు కూడా సూర్య వీడియో గేమ్ ఆడుతున్నట్లే ఆడతాడని అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సూర్య కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేయడంతో ముంబై 200 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.3 ఓవర్లలోనే చేజ్ చేసింది.
ఇది చూసిన గవాస్కర్ మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ లో మాట్లాడాడు. "స్కై బౌలర్లతో ఆటాడుకున్నాడు. అతడు అలా బ్యాటింగ్ చేస్తుంటే.. గల్లీ క్రికెట్ ఆడుతున్నట్లే ఉంటుంది. ప్రాక్టీస్, హార్డ్ వర్క్ తో అతడు మరింత మెరుగయ్యాడు. అతని బాటమ్ హ్యాండ్ చాలా పవర్ ఫుల్. దానిని పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తాడు. ఆర్సీబీతో అతడు మొదట లాంగాన్, లాంగాఫ్ లవైపు ఆడటం మొదలుపెట్టి.. తర్వాత గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు, సిక్స్ లు బాదాడు" అని గవాస్కర్ అన్నాడు.
ఈ మ్యాచ్ లో సూర్య 7 ఫోర్లు, 6 సిక్స్ లు కొట్టాడు. ఐపీఎల్ 2023లో మొదటి ఐదు మ్యాచ్ లూ విఫలమైన సూర్య.. తర్వాత చెలరేగుతున్నాడు. తన చివరి ఐదు మ్యాచ్ లలో నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. సూర్య ఫామ్ లోకి వచ్చినప్పటి నుంచీ ముంబై ఇండియన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. అతని ఆట చూసి ప్రత్యర్థి ప్లేయర్ విరాట్ కోహ్లి కూడా ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. సూర్య ఔటవగానే అతని దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని, భుజం తట్టాడు.