తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Sky: అతడు కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లే ఉంటుంది.. సూర్యను ఆకాశానికెత్తిన గంగూలీ

Ganguly on SKY: అతడు కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లే ఉంటుంది.. సూర్యను ఆకాశానికెత్తిన గంగూలీ

Hari Prasad S HT Telugu

10 May 2023, 10:03 IST

google News
    • Ganguly on SKY: అతడు కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నట్లే ఉంటుంది అంటూ సూర్యను ఆకాశానికెత్తాడు గంగూలీ. మంగళవారం (మే 9) ఆర్సీబీపై అతడు బ్యాటింగ్ చేసిన తీరు చూసిన తర్వాత దాదా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (IPL Twitter)

సూర్యకుమార్ యాదవ్

Ganguly on SKY: సూర్యకుమార్ యాదవ్ మరోసారి తానెందుకు బెస్ట్ టీ20 బ్యాటర్ నో నిరూపించాడు. మంగళవారం (మే 9) ఆర్సీబీతో మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతనికిదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. దీంతో స్కై(SKY)పై బీసీసీఐ మాజీ బాస్, డీసీ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.

ఈ మ్యాచ్ తర్వాత అతడు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "సూర్య కుమార్ యాదవ్ ప్రపంచంలోనే బెస్ట్ టీ20 ప్లేయర్. అతన్ని చూస్తుంటే కంప్యూటర్‌పై బ్యాటింగ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది" అని దాదా ట్వీట్ చేశాడు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్ తో సూర్యను తరుచూ పోలుస్తుంటారు. అలా ఎందుకు అంటారో ఈ మ్యాచ్ లో స్కై నిరూపించాడు.

గంగూలీ ఒక్కడే కాదు.. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెస్సి, గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా సూర్యను ఆకాశానికెత్తారు. "అతడు బెస్ట్ బ్యాటర్లలో ఒకడు. అతడు ఇలా చెలరేగుతుంటే అడ్డుకట్ట వేయడం కష్టం" అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెస్సి మ్యాచ్ తర్వాత అన్నాడు. సూర్య ధాటికి ఎంఐ 200 టార్గెట్ ను కేవలం 16.3 ఓవర్లలోనే చేజ్ చేయడం విశేషం.

అటు గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా మరో లెవల్లో సూర్యను ప్రశంసించాడు. "స్కై నువ్వు టూ గుడ్ భాయ్.. ఇప్పుడు మా బౌలర్లు నీకు ఎలా బౌలింగ్ చేయాలి" అని రషీద్ ట్వీట్ చేశాడు. తన 35 బంతుల్లో 83 పరుగుల ఇన్నింగ్స్ లో సూర్య 7 ఫోర్లు, 6 సిక్స్ లు బాదాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది.

అయితే ఈ మ్యాచ్ లో తనకు అడ్డుకట్ట వేయడానికి ఆర్సీబీ బౌలర్లు మంచి ప్లాన్ వచ్చారని, అయితే తాను వాళ్ల ప్లాన్ కు చెక్ పెట్టినట్లు తెలిపాడు. "వాళ్లు ఓ ప్లాన్ తోనే వచ్చారు. గ్రౌండ్ లో బౌండరీ దూరంగా ఉన్న వైపు కొట్టేలా నన్ను రెచ్చగొట్టారు. స్లో బాల్స్ వేశారు. నేహాల్ తో నేను ఒక్కటే చెప్పాను. బాల్ ను ఎంత బలంగా వీలైతే అంత బలంగా కొట్టమని అన్నాను" అని మ్యాచ్ తర్వాత సూర్య చెప్పాడు.

తదుపరి వ్యాసం