Ganguly on Sachin: నా కెరీర్‌ను మార్చింది సచినే.. వెల్కమ్ టు ద క్లబ్: గంగూలీ-ganguly on sachin says he changed my career ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ganguly On Sachin Says He Changed My Career

Ganguly on Sachin: నా కెరీర్‌ను మార్చింది సచినే.. వెల్కమ్ టు ద క్లబ్: గంగూలీ

Hari Prasad S HT Telugu
Apr 24, 2023 05:59 PM IST

Ganguly on Sachin: నా కెరీర్‌ను మార్చింది సచినే.. వెల్కమ్ టు ద క్లబ్ అంటూ టెండూల్కర్‌కు బర్త్ డే విషెస్ చెప్పాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. సోమవారం (ఏప్రిల్ 24) మాస్టర్ తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ (PTI)

Ganguly on Sachin: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50వ పుట్టిన రోజు సందర్భంగా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పెషల్ విషెస్ చెప్పాడు. అతనితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నాడు. ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియాతో గంగూలీ మాట్లాడాడు. అటు అదే హెడ్ కోచ్ అయిన రికీ పాంటింగ్ కూడా మాస్టర్ కు విషెస్ చెప్పాడు.

టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచిన గంగూలీ.. తన కెరీర్ ను మార్చింది సచినే అని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా తాను తొలిసారి సచిన్ ను కలిసి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. "నన్ను ఓపెనర్ గా దిగాలని సచినే అడిగాడు. సౌతాఫ్రికాతో జైపూర్ లో జరిగిన మ్యాచ్ అది. ఆ సమయంలో మంచి ఓపెనర్ కోసం టీమ్ చూస్తోంది. నేను దానికి సరే అన్నాను. ఆ తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. సచిన్ విషయంలోనూ అదే జరిగింది. అంతకుముందు ఆరో స్థానంలో వచ్చే మాస్టర్.. ఓపెనర్ గా వచ్చిన తర్వాత సక్సెసయ్యాడు. అప్పటి నుంచీ మా ఇద్దరి ఓపెనింగ్ జోడీ కూడా స్టార్టయింది" అని గంగూలీ చెప్పాడు.

ఇక సచిన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ.. వెల్కమ్ టు ద క్లబ్ అని అన్నాడు. గతేడాదే గంగూలీ 50వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా సచిన్ కు కూడా 50 ఏళ్లు నిండటంతో వెల్కమ్ టు ద క్లబ్ అని దాదా అన్నాడు. అటు పాంటింగ్ స్పందిస్తూ.. సచిన్ గురించి తాను తొలిసారి 1988-89 సమయంలోనే విన్నానని, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు ఇండియా వచ్చినప్పుడు తాను నెట్స్ వెనక కూర్చొని సచిన్ బ్యాటింగ్ చూడాలని అనుకుంటున్నట్లు అప్పటి కోచ్ రాడ్ మార్ష్ కు చెప్పినట్లు పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు.

ఈ సందర్భంగా సచిన్ 2004లో సిడ్నీలో ఆడిన ఇన్నింగ్స్ ను కూడా పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. అతని మానసిక బలం అద్భుతని అన్నాడు. ఆ మ్యాచ్ లో తనను తాను కవర్ డ్రైవ్ ఆడకుండా మాస్టర్ నియంత్రించుకున్న తీరు చాలా బాగుందని చెప్పాడు.

WhatsApp channel

సంబంధిత కథనం