MS Dhoni IPL Retirement: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? సీఎస్‌కే మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు
15 April 2023, 14:58 IST
- MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2023 తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అంటే అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. అంతేకాకుండా పలువురు మాజీలు కూడా అతడు ఐపీఎల్‌కు వీడ్కొలు పలుకుతాడని భావిస్తున్నారు.
ఎంఎస్ ధోనీ
MS Dhoni IPL Retirement: ఎంఎస్ ధోనీ(MS Dhoni).. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఇరువురును వేరుగా చూడలేం. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కేతో మహీ తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కొలు పలికి రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఐపీఎల్‌లో ఇంకా చెన్నై కోసమే ఆడుతున్నాడనేది వాస్తవం. ఇదిలా ఉంటే ఈ ఐపీఎల్ సీజనే మహీకి చివరిది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2023 తర్వాత మిస్టర్ కూల్ పూర్తిగా రిటైర్మెంట్‌గా ప్రకటిస్తాడని భావిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై చెన్నై మాజీ ప్లేయర్ కేదార్ జాదవ్(Kedar Jadhav) స్పందించాడు. ధోనీని వదులుకోడానికి చైన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) సిద్ధంగా లేదని స్పష్టం చేశాడు.
"ఎంఎస్ ధోనీ లేకుండా ఐపీఎల్ ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధంగా లేదు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మహీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఎలాగైతే రెడీగా లేరో.. ఇప్పుడు చెన్నై కూడా అతడిని వదులుకోడానికి సిద్ధంగా లేదు. నాకు తెలిసి ఈ సీజనే ధోనీకి చివరిది కావచ్చని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అతడి 41 ఏళ్లు.. మరికొన్ని నెలల్లో 42 వస్తాయి." అని కేదార్ జాదవ్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్ టోర్నీ ఆరంభమైనప్పటి నుచి చెన్నై తరఫున కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటి వరకు ఆ జట్టుకు 4 టైటిల్స్‌ను సాధించాడు. అంతేకాకుండా 11 సార్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. నిషేధం కారణంగా 2016, 2017 మినహా మిగిలిన అన్నీ సీజన్లకు సీఎస్‌కే సారథిగా జట్టును ముందుండి నడిపించాడు.
తన బ్యాటింగ్‌తోనే కాకుండా కెప్టెన్సీ నైపుణ్యం, వికెట్ కీపింగ్స్ స్కిల్స్‌తో అభిమానులను ఎప్పటికప్పుడు ధోనీ అలరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2023లోనూ ఆడిన 4 మ్యాచ్‌ల్లో 214.81 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ 2020 నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో లోవర్ డౌన్‌లో వస్తున్న మహీ.. జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.