తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు ధోనీ క్లాస్‌ - స్టూడెంట్స్‌గా మారిన స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ - వీడియో వైర‌ల్‌

Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌కు ధోనీ క్లాస్‌ - స్టూడెంట్స్‌గా మారిన స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ - వీడియో వైర‌ల్‌

22 April 2023, 12:01 IST

  • Dhoni Turns Guru: ప్ర‌త్య‌ర్థి టీమ్‌ కోసం ధోనీ గురువుగా అవ‌తార‌మెత్తాడు. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ యంగ్ ప్లేయ‌ర్స్‌కు ధోనీ విలువైన స‌ల‌హాలిస్తూ క‌నిపించిన వీడియో సోష‌ల్ మీడియాలోవైర‌ల్‌గా మారింది.

ధోనీ
ధోనీ

ధోనీ

Dhoni Turns Guru: త‌న ఆట‌తీరు, వ్య‌క్తిత్వంతో ప‌లు సంద‌ర్భాల్లో క్రికెట్ అభిమానుల మ‌న‌సుల్ని గెల‌చుకున్నాడు దిగ్గ‌జ క్రికెట‌ర్‌ ధోనీ. శుక్ర‌వారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌రోసారి ధోనీ త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌పై చెన్నై ఏడు వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ముగిసిన అనంత‌రం స‌న్‌రైజ‌ర్స్ యంగ్ ప్లేయ‌ర్స్ అంద‌రూ ధోనీతో భేటీ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

స్టేడియంలోనే వారికి ధోనీ ... క్రికెట్‌లో మెళ‌కువ‌ల‌ను చెబుతూ క‌నిపించాడు. ధోనీ చెబుతోన్న మాట‌ల‌ను శ్ర‌ద్ధ‌గా ఆల‌కిస్తూ స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ క‌నిపించారు. ఈ వీడియోను చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇయాన్ బిష‌న్‌తో పాటు ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ధోనీ గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌న‌మిదంటూ కామెంట్స్ చేశారు.

ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల కోసం ధోనీ గురువుగా మారాడ‌ని ఓ నెటిజ‌న్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ గురువులా క‌నిపిస్తోండ‌గా స‌న్‌రైజ‌ర్స్ ప్లేయ‌ర్స్ అంతా స్టూడెంట్స్‌లో మారిపోయార‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగులు చేయ‌గా డేవాన్ కాన్వే హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో చెన్నై 18 ఓవ‌ర్ల‌లో టార్గెట్‌ను ఛేదించి విజ‌యాన్ని అందుకున్న‌ది. ఈ గెలుపుతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో చెన్నై మూడో స్థానానికి చేరుకున్న‌ది.

టాపిక్

తదుపరి వ్యాసం