IPL 2023 Points Table: టాప్ త్రీలో ధోనీ సేన - పర్పుల్ క్యాప్ లీడర్స్‌లో సిరాజ్ నంబర్ వన్
IPL 2023 Points Table: సన్‌రైజర్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ త్రీలోకి అడుగుపెట్టింది. ఆరెంజ్ క్యాప్ లీడర్స్‌లో డుప్లెసిస్, పర్పుల్ క్యాప్‌లో సిరాజ్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్నారు.
IPL 2023 Points Table: సన్‌రైజర్స్‌పై ఈజీ విక్టరీతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ త్రీలోకి చేరుకున్నది. ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాల్ని అందుకున్న చెన్నై ఎనిమిది పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నది. చెన్నై థర్డ్ ప్లేస్‌లోకి రావడంతో గుజరాత్ నాలుగో స్థానానికి పడిపోగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదు స్థానానికి చేరుకుంది.
పాయింట్స్ టేబుల్‌లో రాజస్థాన్ రాయల్స్ టాప్ ప్లేస్‌లోనే కొనసాగుతోండగా లక్నో సూపర్ జెయింట్స్ రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నది. ఆరు మ్యాచుల్లో రెండు విజయాలతో సన్‌రైజర్స్ తొమ్మిదో స్థానంలో నిలవగా, ఆరు మ్యాచుల్లో ఐదు ఓటములతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్ చివరి స్థానంలో సెటిల్ అయిపోయింది.
ఆరెంజ్ క్యాప్ లీడర్స్‌లో డుప్లెసిస్ నంబర్ వన్
ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లిస్ట్‌లో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ డుప్లెసిస్ 343 రన్స్‌తో నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు. డుప్లెసిస్ తర్వాత వార్నర్ (285 రన్స్), విరాట్ కోహ్లి (279 రన్స్)తో రెండు, మూడు స్థానాల్ని సొంతం చేసుకున్నారు. ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న చెన్నై ఓపెనర్ కాన్వే శుక్రవారం సన్‌రైజర్స్‌పై హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 258 రన్స్‌తో అతడు ఆరెంజ్ క్యాప్ లీడర్స్‌లో నాలుగు స్థానానికి చేరుకున్నాడు కాన్వే.
పర్పుల్ క్యాప్‌లో సిరాజ్ టాప్
పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో బెంగళూరు పేసర్ సిరాజ్ 12 వికెట్లతో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. మార్కవుడ్ (11 వికెట్లు), చాహల్ (11 వికెట్లు)తో సెకండ్, థర్డ్ ప్లేసుల్లో కొనసాగుతోన్నారు. పది వికెట్లతో షమీ ఐదో స్థానంలో నిలవగా చెన్నై యంగ్ పేసర్ తుషార్ దేశ్‌పాండే పది వికెట్లతో ఆరో స్థానంలో నిలిచాడు.