CSK vs SRH: జ‌డేజా స్పిన్‌కు త‌ల‌వంచిన స‌న్‌రైజ‌ర్స్‌ - బోరింగ్ మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు-jadeja stars as csk defeat srh by 7 wickets ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Vs Srh: జ‌డేజా స్పిన్‌కు త‌ల‌వంచిన స‌న్‌రైజ‌ర్స్‌ - బోరింగ్ మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు

CSK vs SRH: జ‌డేజా స్పిన్‌కు త‌ల‌వంచిన స‌న్‌రైజ‌ర్స్‌ - బోరింగ్ మ్యాచ్ అంటోన్న నెటిజ‌న్లు

Nelki Naresh Kumar HT Telugu
Apr 22, 2023 06:45 AM IST

CSK vs SRH: డెవాన్ కాన్వే హాఫ్ సెంచ‌రీతో రాణించ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లు ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు నెమ్మ‌దిగా బ్యాటింగ్ చేయ‌డంపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్నారు.

ర‌వీంద్ర జ‌డేజా
ర‌వీంద్ర జ‌డేజా

CSK vs SRH: ఐపీఎల్ 2023లో భాగంగా శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు న‌ష్ట‌పోయి 134 ప‌రుగులు చేసింది. అభిషేక్ శ‌ర్మ (26 బాల్స్‌లో మూడు ఫోర్లు ఒక సిక్స‌ర్‌తో 34 ర‌న్స్ ) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

మిగిలిన బ్యాట్స్‌మెన్స్ నిదానంగా ఆడ‌టంతో స‌న్‌రైజ‌ర్స్ అతిక‌ష్టం మీద 134 ప‌రుగులు చేసింది. ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్ల‌తో స‌న్‌రైజ‌ర్స్‌ను క‌ట్ట‌డి చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ విధించిన స్వ‌ల్ప టార్గెట్‌ను చెన్నై 18.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. చెన్నై ఓపెన‌ర్లు డెవాన్ కాన్వే 57 బాల్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 77 ర‌న్స్ చేయ‌గా, రుతురాజ్ 30 బాల్స్‌లో 35 ర‌న్స్ చేశాడు. తొలి వికెట్‌కు వీరిదిద్ద‌రు 87 ప‌రుగులు జోడించ‌డంతో చెన్నై ఈజీగా విజ‌యాన్ని అందుకున్న‌ది.

కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెన‌ర్ కాన్వే ఒక్క‌డే 12 ఫోర్లు కొట్ట‌గా...స‌న్‌రైజ‌ర్స్‌ బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ క‌లిసి 11 ఫోర్లు కొట్టారు. స‌న్‌రైజ‌ర్స్ బ్యాటింగ్ టెస్ట్‌ను త‌ల‌పించ‌డంతో నెటిజ‌న్లు వారిపై జోక్స్ వేస్తోన్నారు. ఐపీఎల్ 2023లో మ‌రో బోరింగ్ మ్యాచ్ ఇద‌ని కామెంట్స్ చేస్తోన్నారు. స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌లో అంద‌రూ టెస్ట్ ప్లేయ‌ర్లు ఉన్నారంటూ కామెంట్స్ చేస్తోన్నారు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు సిక్స్‌లు మాత్ర‌మే న‌మోద‌య్యాయి.

WhatsApp channel