తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Chris Gayle: ఐపీఎల్ గ్రేటెస్ట్ ప్లేయర్ క్రిస్ గేల్.. మొత్తం లీగ్‌నే మార్చేశాడు: కుంబ్లే

Chris Gayle: ఐపీఎల్ గ్రేటెస్ట్ ప్లేయర్ క్రిస్ గేల్.. మొత్తం లీగ్‌నే మార్చేశాడు: కుంబ్లే

Hari Prasad S HT Telugu

29 March 2023, 15:53 IST

google News
  • Chris Gayle: ఐపీఎల్ గ్రేటెస్ట్ ప్లేయర్ క్రిస్ గేల్.. మొత్తం లీగ్‌నే మార్చేశాడు అని అన్నాడు మాజీ ప్లేయర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే. అదే ఆర్సీబీ తరఫున గేల్ ఎన్నో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

క్రిస్ గేల్
క్రిస్ గేల్

క్రిస్ గేల్

Chris Gayle: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో క్రిస్ గేల్ క్రియేట్ చేసిన సునామీని ఎవరూ అంత త్వరగా మరచిపోరు. 2008లో తొలి సీజన్ తొలి మ్యాచ్ లోనే బ్రెండన్ మెకల్లమ్ మెరుపు సెంచరీతో సంచలనం సృష్టించగా.. ఆ తర్వాత గేల్ లాంటి ప్లేయర్స్ దానిని మరో లెవల్ కు తీసుకెళ్లారు. ముఖ్యంగా 2013 సీజన్ లో గేల్ 30 బంతుల్లోనే సెంచరీ, 175 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ను ఎవరు మాత్రం మరచిపోగలరు.

ఈ మెగా లీగ్ పై అతడు చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడు ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ లీగ్ లో గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు ప్రశ్నకు కొందరు మాజీ క్రికెటర్లు సమాధానమిచ్చారు. అందులో ఏ ఆర్సీబీ తరఫున గేల్ సునామీ సృష్టించాడో.. అదే ఆర్సీబీకి తొలి రెండు సీజన్లలో కెప్టెన్ గా ఉన్న అనిల్ కుంబ్లే కూడా ఉన్నాడు.

అతని ప్రకారం ఐపీఎల్ గ్రేటెస్ట్ ప్లేయర్ క్రిస్ గేలే. "చాలా మంది ప్లేయర్సే ఉన్నారు. ఒక్కరిని ఎంచుకోవడం కాస్త కష్టే. అయితే 15 సీజన్లు చూస్తే క్రిస్ గేల్ గ్రేటెస్ట్ ప్లేయర్ కావచ్చు. ఓ ప్లేయర్ గా అతను చెరగని ముద్ర వేశాడు. పవర్ బ్యాటింగ్ కు పెట్టింది పేరు. పవర్ ప్లే మొత్తాన్నీ మార్చేశాడు" అని జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు.

క్రిస్ గేల్ ఐపీఎల్లో 142 మ్యాచ్ లు ఆడి 4965 రన్స్ చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు అతనిదే. ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా గేల్ (175) సొంతం. 357 సిక్స్ లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 2021లో తన చివరి ఐపీఎల్ సీజన్ ఆడిన గేల్.. ఆ తర్వాత తనను ఎవరూ తీసుకోకపోవడంతో ప్రస్తుతం దూరంగా ఉన్నాడు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న గేల్ ఆర్సీబీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. నిజానికి ఆర్సీబీకి ముందు కేకేఆర్ టీమ్ తో, ఆ తర్వాత పంజాబ్ కింగ్స తో ఉన్నా కూడా గేల్ ఆ స్థాయి ప్రదర్శన ఎప్పుడూ చేయలేదు. ఆర్సీబీలో అతడు ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఆ టీమ్ లో కోహ్లి కెప్టెన్సీలో ఆడటాన్ని తాను ఎప్పుడూ మరచిపోలేనని గేల్ అన్నాడు.

తదుపరి వ్యాసం