Arjun Tendulkar: ముంబై గడ్డపై అర్జున్ కు చేదు అనుభవం - చెత్త రికార్డ్‌ను మూట గట్టుకున్న సచిన్ తనయుడు
23 April 2023, 11:41 IST
Arjun Tendulkar: శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై పేసర్, సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఆ రికార్డ్ ఏదంటే...
అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar: సొంత మైదానం వాంఖడేలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఓకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ 48 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
రెండు ఓవర్లు కట్టుదిట్టంగా వేసిన అర్జున్ టెండూల్కర్ మూడో ఓవర్‌లో మాత్రం 31 పరుగులు ఇచ్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో అర్జున్‌కు బంతిని అప్పగించాడు ముంబై కెప్టెన్ రోహిత్. ఈ ఓవర్‌లో తొలి బంతిని సామ్ కరన్ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో సామ్ కరన్ మరో రెండు ఫోర్లు కొట్టగా..హర్‌ప్రీత్ సింగ్ రెండు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు. మొత్తంగా రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు, ఓ వైడ్, ఓ నోబాల్‌తో ఈ ఓవర్‌లో 31 పరుగులు వచ్చాయి.
దాంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది.కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ యశ్ ధయాల్ కూడా ఒకే ఓవర్‌లో 31 రన్స్ ఇచ్చాడు. పంజాబ్ మ్యాచ్ ద్వారా యశ్ ధయాల్ సరసన అర్జున్ చేరాడు.
అంతే కాకుండా ముంబై ఇండియన్ తరఫున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ నిలిచాడు. ఈ జాబితాలో డేనియల్ సామ్స్ 35 పరుగులతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇరవై ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో ముంబై 201 రన్స్ మాత్రమే చేసింది.