Kohli Breaks Sachin Record: సచిన్ రేర్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన కోహ్లి - అతడే నంబర్ వన్
Kohli Breaks Sachin Record: ఇంటర్‌నేషన్ క్రికెట్‌లో కోహ్లి మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మూడు ఫార్మెట్లలో కలిపి అత్యంత వేగంగా ఇరవై ఐదు వేల పరుగుల్ని పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా నిలిచాడు.
Kohli Breaks Sachin Record: విరాట్ కోహ్లికి రికార్డులు కొత్తేమీ కాదు. తాజాగా ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డ్‌ను నెలకొల్పాడు కోహ్లి. మూడు ఫార్మెట్స్‌లో కలిపి ఇరవై ఐదు వేల రన్స్ పూర్తిచేసుకున్నాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
గతంలో ఈ రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ టెండూల్కర్ 577 ఇన్నింగ్స్‌లలో 25వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి 549 ఇన్నింగ్స్‌లలోనే 25000 పరుగుల మార్కును చేరుకొని సచిన్ రికార్డ్‌ను అధిగమించాడు.
ఇంటర్‌నేషనల్ క్రికెట్‌లో మూడు ఫార్మెట్స్‌లో కలిపి 25వేల పరుగుల్ని పూర్తిచేసుకొన్న ఆరో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్‌తోపాటు రికీ పాంటింగ్, కలిస్, కుమార సంగక్కర, మహేలా జయవర్ధనే మాత్రమే ఉన్నారు.
ఈ ఆరుగురిలో అత్యధిక యావరేజ్ విరాట్ కోహ్లిదే కావడం గమనార్హం. కోహ్లి 53.64 యావరేజ్‌తో 25000 పరుగల్ని పూర్తిచేయగా సచిన్ 48.52 యావరేజ్‌తో ఈ రికార్డ్‌ను చేరుకున్నాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.