తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virender Sehwag : గిల్, కోహ్లీ, ఫాఫ్ కాదు.. ఐపీఎల్‌లో సెహ్వాగ్ మెచ్చిన 5 బ్యాట్స్‌మెన్‌లు వీరే

Virender Sehwag : గిల్, కోహ్లీ, ఫాఫ్ కాదు.. ఐపీఎల్‌లో సెహ్వాగ్ మెచ్చిన 5 బ్యాట్స్‌మెన్‌లు వీరే

Anand Sai HT Telugu

28 May 2023, 5:33 IST

    • Virender Sehwag On Players : ఐపీఎల్ 2023 ముగింపు దశకు వచ్చింది. అయితే ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాక్.. తనకు నచ్చిన కొంతమంది ఆటగాళ్ల పేర్లు చెప్పాడు. వారిలో గిల్, కోహ్లీ, ఫాల్ లేరు.
వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ (twitter)

వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 16వ ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. రెండు నెలల సుదీర్ఘ క్రీడా పోటీలకు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో తెర పడనుంది. ఈ టోర్నీలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్(CSK Vs GT) ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఈ టోర్నమెంట్‌లో అభిమానులు మంచి మంచి బ్యాటింగ్‌ చూశారు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) ఇప్పటి వరకు ఆడిన 16 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలతో 851 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అంతేకాకుండా, విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా టోర్నమెంట్‌లో రెండు సెంచరీలు సాధించాడు.

ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఈసారి ఐపీఎల్‌ టోర్నీలో టాప్‌ ఫైవ్‌ ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ, 'వీరే నా ఐదుగురు పాండాలు. వీరే క్రికెట్‌లోని పాండాలు. నేను ఇక్కడ ఎక్కువ మంది ఓపెనర్‌లను ఎంచుకోలేదు ఎందుకంటే వారికి చాలా అవకాశాలు లభిస్తాయి. నాకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు రింకూ సింగ్(Rinku Singh). దీనికి కారణం కూడా మీరు అడగరని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక జట్టు గెలిచేందుకు ఐదు సిక్సర్లు ఎప్పుడూ చూడలేదు. రింకూ సింగ్ మాత్రమే ఆ ఘనత సాధించాడు.' అని సెహ్వాక్ అన్నాడు.

'రెండవ మిడిలార్డర్ ఆటగాడు శివమ్ దూబే(Shivam Dube). అతను ఈసారి 33 సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 160. గత కొన్ని ఎడిషన్లలో అతను ప్రత్యేకమైన ప్రదర్శనను కలిగి లేడు. కానీ ఈసారి అతను చాలా స్పష్టంగా ఆడాడు.' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్న మూడో పేరు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal). 'తెలివైన ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం నన్ను ఆశ్చర్యపరిచింది. జైస్వాల్ తర్వాత నా ఎంపిక సూర్యకుమార్ యాదవ్. సూర్య ఫామ్‌లో లేడు. కానీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాక చెలరేగిపోయాడు.’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. సెహ్వాగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ హెన్రిక్ క్లాసిన్‌ను కూడా తన ఫేవరెట్ లిస్టులో చేర్చాడు. అయితే ఆసక్తికరంగా శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్ పేర్లు సెహ్వాక్ చెప్పలేదు.

తదుపరి వ్యాసం