Shubman Gill IPL Record: ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పిన గిల్ - కోహ్లి తర్వాత అతడే
Shubman Gill IPL Record: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఒకే సీజన్‌లో ఏడు వందలకుపైగా పరుగులు సాధించిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న క్రికెటర్ ఎవరంటే...
Shubman Gill IPL Record: ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల వరద పారిస్తోన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పదిహేను మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 722 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో డుప్లెసిస్‌తో పోటీపడుతోన్నాడు.
మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఏడు వందల కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో ఇండియన్ క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ నెలకొల్పాడు.
అతడి కంటే ముందు కోహ్లి మాత్రమే ఈ ఘనతను సాధించాడు. 2016 సీజన్‌లో నాలుగు సెంచరీలతో చెలరేగిన కోహ్లి 973 రన్స్ చేశాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. కోహ్లి రికార్డ్‌ను ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 722 రన్స్‌తో కోహ్లి తర్వాతి స్థానంలో శుభ్‌మన్ గిల్ నిలిచాడు.
అంతే కాకుండా ఒకే సీజన్‌లో ఏడు వందలకుపైగా పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా శుభ్‌మన్ గిల్ మరో రికార్డ్ సాధించాడు. ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో 730 రన్స్‌తో డుప్లెసిస్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోండగా 722 రన్స్‌తో శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. 639 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో ఉన్నాడు.