PBKS vs GT: దంచికొట్టిన శుభ్‌మన్ - పంజాబ్‌పై గుజరాత్ విజయం
PBKS vs GT: సూపర్‌ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్‌గిల్ మరో హాఫ్ సెంచరీతో రాణించి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది.
PBKS vs GT: కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో విజయం ముగింట బోల్తా కొట్టిన గుజరాత్ తిరిగి గెలుపు బాట పట్టింది. గురువారం పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్‌మన్‌గిల్ హాఫ్ సెంచరీతో గుజరాత్‌కు అద్భుతమైన విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది.

ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ డకౌట్ కాగా ఫామ్‌లో ఉన్నకెప్టెన్ ధావన్ 8 పరుగులకు ఔట్ కావడం పంజాబ్‌ను దెబ్బతీసింది. షార్ట్ (24 బాల్స్‌లో 36 రన్స్) ధాటిగా ఆడిన మిగిలిన బ్యాట్స్‌మెన్స్‌లో ఆ జోరు కనిపించలేదు. రాజ్‌పక్స, జితేన్‌శర్మ, సామ్ కరన్ వన్డే తరహాలో ఆడటంతో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. చివరలో షారుఖ్‌ఖాన్ మెరుపులతో పంజాబ్ 153 పరుగులు చేయగలిగింది. షారుఖ్ తొమ్మిది బాల్స్‌లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 రన్స్ చేశాడు.
గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసుకున్నాడు. 154పరుగుల టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ దిగన గుజరాత్‌కు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సాహా 19 బాల్స్‌లో 30 రన్స్ చేయగా మరోవైపు శుభ్‌మన్ భారీ షాట్స్‌తో చెలరేగాడు. 49 బాల్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 రన్స్ చేశాడు.
విజయం ముగింట హార్దిక్ పాండ్య, సాయిసుదర్శన్ వికెట్లను కోల్పోయిన డేవిడ్ మిల్లర్ సమయోచిత బ్యాటింగ్‌తో గుజరాత్‌ను గెలిపించాడు.