Shubman Gill - Sara : అయ్యయ్యో ఇలా చేశారేంటి.. శుభ్‌మన్ గిల్-సారాకు బ్రేకప్ అయిందా?
Shubman Gill - Sara : సెలబ్రెటీల విషయంలో ఏదైనా చిన్నగా జరిగినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా సారా అలీఖాన్, శుభ్‌మన్ గిల్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
టీమిండియా ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill), బాలీవుడ్ నటి సారా అలీఖాన్(Sara Ali Khan) డేటింగ్‌లో ఉన్నారనే వార్త ఇటీవల హల్చల్ చేసింది. వీరిద్దరూ ఓ హోటల్‌లో కలుసుకోవడమే ఈ వార్తలకు ప్రధాన కారణం. దీని తర్వాత వారిద్దరూ విమానాశ్రయంలో కలుసుకున్నారని, గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరి బంధానికి తెరపడినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం చాలా అనుమానాలకు దారితీసింది. వారు నిజంగా డేటింగ్ చేస్తున్నారా? లేదా? అనే ప్రశ్న కూడా ఉంది.
అసలే ఇది సోషల్ మీడియా(Social Media) కాలం. ఏదైనా విషయం జరిగితే వెంటనే.. వైరల్ అవుతుంది. సెలబ్రిటీ విడాకుల గురించి మొదట సోషల్ మీడియాలో హింట్ వస్తుంది. తర్వాత భాగస్వామితో ఉన్న ఫొటోను తొలగించడం జరుగుతుంది. ఒకరినొకరు.. సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకుంటారు. ఇప్పుడు సారా అలీఖాన్, శుభ్‌మన్ గిల్ విషయంలోనూ అలాగే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో పలు అనుమానాలు తలెత్తాయి.
శుభమాన్ గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar) డేటింగ్‌లో ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో సారా అలీ ఖాన్‌తో శుభ్‌మన్ కనిపించాడు. వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని వినికిడి. అయితే కొద్ది నెలల్లోనే వీరి బంధం తెగిపోయింది. సారా అలీ ఖాన్ అభిమానులకు ఇది షాకింగ్ వార్త.
సారా అలీ ఖాన్ బాలీవుడ్(Bollywood)లో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. సైఫ్ అలీఖాన్ కూతురు కావడంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు ఈ ఐపీఎల్(IPL)లో గిల్ మెరుపులు మెరిపిస్తున్నాడు. బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నాడు. క్వాలిఫయర్ 2లోనూ ముంబయిపై 129 పరుగులు చేశాడు. ఈ ఏడాది టోర్నిలో మూడు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు గిల్. మే 28న జరగనున్న ఫైనల్ మ్యాచులోనూ గిల్ ప్రదర్శనపై అందరికీ ఆసక్తి ఉంది.