తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Auction: ఐపీఎల్‌ వేలానికి ముహూర్తం ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడ అంటే..

IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలానికి ముహూర్తం ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడ అంటే..

Hari Prasad S HT Telugu

09 November 2022, 18:36 IST

google News
    • IPL 2023 Auction: ఐపీఎల్‌ వేలానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. 2023 టోర్నీ కోసం డిసెంబర్‌ 23న వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి వేలం కొచ్చిలో జరగనుంది.
డిసెంబర్ 23న జరగనున్న ఐపీఎల్ 2023 వేలం
డిసెంబర్ 23న జరగనున్న ఐపీఎల్ 2023 వేలం (Twitter)

డిసెంబర్ 23న జరగనున్న ఐపీఎల్ 2023 వేలం

IPL 2023 Auction: టీ20 వరల్డ్‌కప్‌ క్లైమ్యాక్స్‌ దగ్గర పడుతోంది. ఇక వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌ హంగామా ఇప్పటి నుంచే ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్‌ వేలానికి ముహూర్తం ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌ 23న కొచ్చిలో ఐపీఎల్‌ 2023 వేలం జరగనుంది. ఈసారి ప్లేయర్స్‌ కొనుగోలు కోసం ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.5 కోట్లు కేటాయించారు.

ఇది కాకుండా ఒకవేళ ఆయా ఫ్రాంఛైజీలు ప్లేయర్స్‌ను రిలీజ్‌ చేస్తే ఆ మొత్తం, ఈ ఏడాది మొదట్లో జరిగిన మెగా వేలంలో మిగిలిపోయిన మొత్తం కూడా ఈ రూ.5 కోట్లకు అదనం. ఈ వేలంలో పది టీమ్స్ పాల్గొననున్నాయి. ప్రస్తుతం ఉన్న టీమ్స్‌లో పంజాబ్‌ కింగ్స్‌ దగ్గర గత వేలంలో మిగిలిపోయిన రూ.3.45 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తానికి రూ.5 కోట్లతోపాటు ఎవరైనా ప్లేయర్స్‌ను ఆ టీమ్‌ను రిలీజ్‌ చేస్తే ఆ మొత్తం కూడా దీనికి యాడ్ అవుతుంది.

ఏ టీమ్‌ దగ్గర ఎంత డబ్బు ఉందంటే..

కొత్త టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ దగ్గర అసలు ఏమాత్రం డబ్బు మిగలలేదు. ఈ టీమ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఒక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దగ్గర రూ.0.45 కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌ దగ్గర రూ.0.95 కోట్లు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.1.55 కోట్లు, చెన్నై సూపర్‌ కింగ్స్ రూ.2.95 కోట్లు, గుజరాత్‌ టైటన్స్‌ రూ.0.15 కోట్లు, ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దగ్గర తలా రూ.0.10 కోట్లు ఉన్నాయి.

నవంబర్‌ 15లోపు ఫ్రాంఛైజీలన్నీ తాము రిలీజ్‌, రిటేన్‌ చేయాలనుకుంటున్న ప్లేయర్స్‌ లిస్ట్‌ను అందించాల్సి ఉంటుంది. డిసెంబర్‌ తొలి వారంలో వేలంలో అందుబాటులో ఉండే ప్లేయర్స్‌ జాబితా సిద్ధం కానుంది. ఒక్కో ఫ్రాంఛైజీ దగ్గర గరిష్ఠంగా 8 మంది విదేశీ ప్లేయర్స్‌ ఉండే అవకాశం ఉంది. ఆ లెక్కన గత వేలంలో ఏడుగురినే తీసుకున్న లక్నో, ఢిల్లీ, పంజాబ్‌ టీమ్స్‌ ఒక్కో ప్లేయర్‌ను ఇప్పుడు తీసుకునే వీలుంది.

ఇక ఆరు ఫ్రాంఛైజీలు గత సీజన్‌లో వివిధ కారణాలతో కొందరు ప్లేయర్స్‌ స్థానంలో వేరే వారిని తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయా ఫ్రాంఛైజీలు ఆ రీప్లేస్‌మెంట్‌ ప్లేయర్‌ లేదా అసలు ప్లేయర్‌లను రిటేన్‌ చేసుకునే వీలుంది. ఇది మినీ వేలం కావడంతో ఫ్రాంఛైజీలు తమ దగ్గర లేని వనరులను పరిమిత స్థాయిలో మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం