తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Australia 2nd T20i: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. అదరగొట్టిన రోహిత్.. చివర్లో కార్తిక్ మెరుపులు

India vs Australia 2nd T20I: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. అదరగొట్టిన రోహిత్.. చివర్లో కార్తిక్ మెరుపులు

23 September 2022, 23:26 IST

google News
    • India vs Australia: నాగ్‌పుర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. అఅనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం (PTI)

ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

India vs Australia 2nd T20I: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 8 ఓవర్లలో 91 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్లు కోల్పోయి ఛేదించింది. పలితంగా మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 46 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు చివర్లో దినేశ్ కార్తిక్ 2 బంతుల్లో 10 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ కోహ్లీ 11 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా 3 వికెట్లు తీయగా.. కమిన్స్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

91 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించో క్రమంలో టీమిండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్(10) తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. ముఖ్యంగా హిట్ మ్యాన్ అదిరిపోయే సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుబడ్డాడు. అతడికి రాహుల్ కూడా చక్కటి సాయం అందించాడు. అయితే మూడో ఓవర్లో ఆడం జంపా రాహుల్‌ను ఔట్ చేశాడు. అనంతరం స్కోరు కాస్త నెమ్మదించినప్పిటికీ విరాట్ కోహ్లీ, రోహిత్ తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

ఒత్తిడి పెంచిన జంపా..

నాలుగో ఓవర్ వేసిన సామ్స్‌ను రోహిత్, విరాట్ చెరో ఫోర్ బాది ఆ ఓవర్‌లో 11 పరుగులు పిండుకున్నారు. అయితే ఐదో ఓవర్ వేసిన జంపా.. టీమిండియా అభిమానులను కలవరపెట్టారు. తొలి బంతి బౌండరీ కొట్టిన కోహ్లీ(11) తర్వాతి బంతికే బౌల్డ్ చేయగా.. అనంతరం వెంటనే సూర్యకుమార్ యాదవ్‌ను(0) ఎల్బీగా పెవిలియన్ పంపాడు. ఫలితంగా 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. పైపెచ్చు ఆ ఓవర్ కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. హార్దిక్ పాండ్య(9) సాయంతో హిట్ మ్యాన్ స్కోరు వేగాన్ని పెంచాడు. వీరిద్దరూ ఆరో ఓవర్‌ వేసిన సీన్ అబాట్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాది మళ్లీ 11 పరుగులు రాబట్టుకున్నారు.

చివరి రెండు ఓవర్లకు 22 పరుగులు అవసరం కాగా.. కమిన్స్ వేసిన ఏడో ఓవర్‌లో పాండ్య ఔట్ కావడంతో భారత్ కాస్త ఒత్తిడికి లోనయింది. అదే ఓవర్ చివరి బంతికి రోహిత్ బౌండరీ కొట్టడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. అయితే చివరి ఓవర్లో గెలుపునకు 9 పరుగులు అవసరం కాగా.. క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్(10) మొదటి రెండు బంతుల్లోనే విజయాన్ని ఖరారు చేశాడు. డేనియల్ సామ్స్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతినే బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా కళ్లు తిరిగే సిక్సర్ బాదిన కార్తిక్.. రెండో బంతిని కూడా మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఫలితంగా భారత్ మరో 4 బంతులు మిగులండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని ఖరారు చేసుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 90 పరుగులు చేసింది. మ్యాథ్యూ వేడ్ 43 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ ఫించ్ 31 పరుగులతో రాణించాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. . విదర్బ మైదానం అవుట్ ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ టాస్ మూడు గంటల పాటు ఆలస్యమైంది. ఈ కారణంగా రిఫరీ మ్యాచ్ ఓవర్లను కుదించారు. ఇరు జట్లకు చెరో 8 ఓవర్లు ఆడే అవకాశాన్ని కలగజేశారు.

<p>విజయానంతరం రోహిత్-దినేశ్ కార్తిక్ సంబురాలు</p>
తదుపరి వ్యాసం