Wasim Jaffer on rishabh Pant: వరల్డ్ కప్‌లో పంత్‌ను ఆడించకపోవడమే మంచిది.. టీమిండియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు-wasim jaffer says leaving out rshabh pant in t20 world cup team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Wasim Jaffer Says Leaving Out Rshabh Pant In T20 World Cup Team

Wasim Jaffer on rishabh Pant: వరల్డ్ కప్‌లో పంత్‌ను ఆడించకపోవడమే మంచిది.. టీమిండియా మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Sep 20, 2022 12:41 PM IST

Rishabh Pant Performance in T20s: టీ20 వరల్డ్ కప్‌లో రిషభ్ పంత్ తీసుకోవడంపై పునరాలోచించాలని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. అతడి స్థానంలో దినేశ్ కార్తిక్‌కు అవకాశమివ్వాలని తెలిపాడు.

రిషభ్ పంత్
రిషభ్ పంత్ (AFP)

Wasim Jaffer About Rishabh Pant: రిషభ్ పంత్.. టీ20ల్లో గత కొంతకాలంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లోనూ పంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్‌ను కాదని, పంత్‌కు అవకాశం కల్పించడం, సంజూ శాంసన్‌కు జట్టులో తీసుకోకపోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషభ్ పంత్ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌కు అవకాశం కల్పించాలని స్పష్టం చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

"రిషభ్ పంత్ ఆడతాడా లేదా అనేది భారత్ గుర్తించాల్సిన అవసరం ఉంది. పంత్‌ను బరిలోకి దింపడం గురించి పునరాలోచించాలి. అతడు చాలా ప్రతిభావంతుడైన బ్యాటరే. టెస్టులు, వన్డేల్లో వన్ మ్యాన్ చేశాడు. కానీ టీ20ల్లో పెద్దగా రాణించలేదు. కాబట్టి భారత జట్టులో టాప్-6లో పంత్‌ను తీసుకోవడంపై ఆలోచించాలి. ఐపీఎల్‌లో రాణిస్తున్నా దినేశ్ కార్తీక్‌ ఆటను కూడా గుర్తించాలి. పంత్ 4 లేదా 5వ స్థానానికి సరిపోడని నేను అనుకుంటున్నా. ఓపెనింగ్‌లో అతడు బాగా రాణించగలడు. ఇది జరగదని అర్థమవుతుంది. ప్రపంచకప్‌లో పంత్‌ను పక్కన పెట్టడం మంచిదని అనుకుంటున్నా." అని జాఫర్ స్పష్టం చేశాడు.

ఇదే సమయంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై జాఫర్ స్పందించాడు. "ఇటీవల కాలంలో అక్షర్ పటేల్ బాగా రాణిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. టీమిండియా అతడిని ఎందుకు విశ్వసించడంలేదో తెలియడం లేదు. తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను గెలుస్తున్నాడు." అని జాఫర్ తెలిపాడు.

మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా మంగళవారం నాడు తొలి మ్యాచ్ ఆడుతోంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 23న నాగ్‌పూర్ వేదికగా రెండో టీ20, సెప్టెంబరు 25న మూడో మ్యాచ్ ఆడనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం