తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Player Of The Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో జడేజా

ICC Player of the month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో జడేజా

Hari Prasad S HT Telugu

07 March 2023, 16:35 IST

google News
    • ICC Player of the month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో జడేజా నిలిచాడు. ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడేజా ఆల్ రౌండ్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే.
రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (AFP)

రవీంద్ర జడేజా

ICC Player of the month: ఇండియన్ టీమ్ లోకి సుమారు ఐదు నెలల తర్వాత తిరిగొచ్చాడు రవీంద్ర జడేజా. అయితే ఇంత కాలం తర్వాత ఆడిన తొలి టెస్టులో తనను టీమ్ ఎంతలా మిస్ అయిందో అతడు నిరూపించాడు. ఆల్ రౌండ్ మెరుపులతో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో ఫిబ్రవరి నెలకుగాను అతడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. అతనితోపాటు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్, వెస్టిండీస్ ప్లేయర్ గుడకేష్ మోటీ కూడా నామినేట్ అయ్యారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియా బౌలింగ్ అటాక్ ను ముందుండి నడిపిస్తున్నాడు జడేజా. మూడు టెస్టుల్లోనే అతడు ఏకంగా 21 వికెట్లు తీసుకున్నాడు.

రెండో టెస్టులో 10 వికెట్లు తీయడం విశేషం. ఈ సిరీస్ లో ప్రస్తుతం అత్యధిక వికెట్లు తీసిన వారిలో జడేజా టాప్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లయన్ 19 వికెట్లతో రెండోస్థానంలో నిలిచాడు. ఇక మూడు టెస్టుల్లో బ్యాట్ తోనూ 107 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే జడేజా 17 వికెట్లతోపాటు ఓ హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలవడం విశేషం.

నాగ్‌పూర్ లో జరిగిన తొలి టెస్టులో జడేజా కీలకమైన 70 పరుగులు చేశాడు. ఇప్పుడు నాలుగో టెస్టులో ఇండియా గెలవాలంటే జడేజా కీలకంగా మారాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో జడేజా మరోసారి ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించాల్సిందే.

మరోవైపు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టెస్ట్ క్రికెట్ లో రికార్డులు తిరగరాస్తున్నాడు. డిసెంబర్ లో ఇప్పటికే ఈ అవార్డు గెలిచిన అతడు.. మరోసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో ఉన్నాడు. తన కెరీర్ లో ఆడిన తొలి 9 టెస్టుల్లోనే 800కుపైగా రన్స్ చేసి హిస్టరీ క్రియేట్ చేశాడు బ్రూక్. ఈ మధ్యే న్యూజిలాండ్ సిరీస్ లోనూ ఇంగ్లండ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.

రెండు టెస్టుల్లో కలిపి 329 పరుగులు చేశాడు. అందులో రెండో టెస్టులో 186 రన్స్ చేయడం విశేషం. అటు వెస్టిండీస్ బౌలర్ గుడకేష్ మోటీ కూడా తన లెఫ్టామ్ స్పిన్ తో మాయ చేశాడు. జింబాబ్వేపై రెండు టెస్టుల సిరీస్ లో 19 వికెట్లు తీసుకున్నాడు. రెండో టెస్టులో ఏకంగా 13 వికెట్లు తీయడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ స్పిన్నర్ కు ఇదే బెస్ట్.

తదుపరి వ్యాసం