తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Player Of The Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ జోస్‌ బట్లర్‌

ICC Player of The Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ జోస్‌ బట్లర్‌

Hari Prasad S HT Telugu

12 December 2022, 16:53 IST

    • ICC Player of The Month: ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును జోస్‌ బట్లర్‌ ఎగరేసుకుపోయాడు. ఇంగ్లండ్‌ టీమ్‌ను అతడు టీ20 వరల్డ్‌కప్‌ విజేతగా నిలిపిన విషయం తెలిసిందే.
జోస్ బట్లర్
జోస్ బట్లర్ (AFP)

జోస్ బట్లర్

ICC Player of The Month: ఐసీసీ ప్రతి నెలా ఇచ్చే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు ఈసారి ఇంగ్లండ్‌ వైట్‌ బాల్ టీమ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ను వరించింది. నవంబర్‌ నెలకుగాను తనకు పోటీలో ఉన్న ఇద్దరిని వెనక్కి నెట్టి బట్లర్‌ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. గత నెలలో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇంగ్లండ్‌ను మరోసారి విశ్వవిజేతగా నిలిపిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇంగ్లండ్‌కే చెందిన ఆదిల్‌ రషీద్‌, పాకిస్థాన్‌ పేసర్‌ షహీన్‌ షా అఫ్రిదిలు కూడా ఈ అవార్డు కోసం పోటీ పడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఇద్దరు ప్లేయర్స్‌ కూడా తమ టీమ్స్‌ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ను ముందుండి నడిపించిన జోస్‌ బట్లర్‌నే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం ఐసీసీ ఎంపిక చేసింది.

ముఖ్యంగా సెమీఫైనల్లో ఇండియాపై అతడు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 49 బాల్స్‌లోనే 80 రన్స్ చేయడంతో ఇంగ్లండ్‌ టీమ్‌ 10 వికెట్లతో ఇండియాను చిత్తుగా ఓడించింది. తనను ఈ అవార్డు వరించడంపై బట్లర్‌ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పాడు. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా బట్లర్‌ మాట్లాడాడు.

క్రికెట్‌లో తన అత్యుత్తమ నెలల్లో గత నవంబర్‌ కూడా ఒకటని ఈ సందర్భంగా బట్లర్‌ చెప్పాడు. "నవంబర్‌ నెలకుగాను ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌గా నన్ను ఎన్నుకున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను ఇదే నెలలో గెలిచాము. ఇందులో మా టీమ్‌ సభ్యులందరి కృషి ఉంది. ఇప్పటి వరకూ నేను క్రికెట్‌ ఆడిన అత్యుత్తమ నెలల్లో ఈ నవంబర్‌ ముందుంటుంది. వరల్డ్‌ ఛాంపియన్స్‌గా ముందుండి నడిపించడం మరింత స్పెషల్‌" అని బట్లర్‌ అన్నాడు.