Pakistan vs England 2nd Test: ఇంగ్లండ్‌ మరో చారిత్రక విజయం.. రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్‌ చిత్తు-pakistan vs england 2nd test as visitors win the series with one test still to go ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Vs England 2nd Test As Visitors Win The Series With One Test Still To Go

Pakistan vs England 2nd Test: ఇంగ్లండ్‌ మరో చారిత్రక విజయం.. రెండో టెస్ట్‌లోనూ పాకిస్థాన్‌ చిత్తు

Hari Prasad S HT Telugu
Dec 12, 2022 02:16 PM IST

Pakistan vs England 2nd Test: ఇంగ్లండ్‌ మరో చారిత్రక విజయం సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై తొలిసారి వరుసగా రెండో టెస్టుల్లో గెలిచింది. ఈ విజయంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది.

పాకిస్థాన్ గడ్డపై వరుసగా రెండు టెస్టుల్లో గెలవడం ఇంగ్లండ్ కు ఇదే తొలిసారి
పాకిస్థాన్ గడ్డపై వరుసగా రెండు టెస్టుల్లో గెలవడం ఇంగ్లండ్ కు ఇదే తొలిసారి (AP)

Pakistan vs England 2nd Test: ఇంగ్లండ్‌ దూకుడు కొనసాగుతోంది. పాకిస్థాన్‌ గడ్డపై ఆ టీమ్‌ చారిత్రక సిరీస్‌ విజయం సాధించింది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్‌లో 74 రన్స్‌తో గెలవగా.. ముల్తాన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 26 రన్స్‌తో గెలిచింది. నాలుగు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై వరుసగా రెండు టెస్టులు గెలవడం ఇంగ్లండ్‌కు ఇదే తొలిసారి.

ట్రెండింగ్ వార్తలు

355 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ చివరికి 328 రన్స్‌కు ఆలౌటైంది. ఈ విజయంతో 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై మరోసారి టెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించింది ఇంగ్లండ్‌ టీమ్‌. బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్‌ అయిన తర్వాత ఇంగ్లండ్‌ ఆడిన 9 టెస్టుల్లో 8 గెలవడం విశేషం. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ తిరుగులేని 2-0 ఆధిక్యం సంపాదించింది.

ఈ మ్యాచ్‌లో గెలవడానికి పాకిస్థాన్‌ పోరాడినా.. తొలి టెస్ట్‌లాగే చివరి వరకూ వచ్చి బోల్తా పడింది. పాకిస్థాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో సాద్‌ షకీల్‌ 94, ఇమాముల్ హక్‌ 60, మహ్మద్‌ నవాజ్‌ 45 రన్స్‌ చేశారు. చివర్లో అఘా సల్మాన్‌ (20 నాటౌట్‌) పాక్‌ టీమ్‌లో ఆశలు రేపినా.. మరోవైపు మహ్మద్‌ అలీ (0) చివరి వికెట్‌గా ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 4, ఓలీ రాబిన్సన్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 281 రన్స్‌ చేయగా.. పాకిస్థాన్‌ 202 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో కీలకమైన 79 రన్స్‌ ఆధిక్యం ఇంగ్లండ్‌కు లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 275 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్‌ ముందు 355 పరుగుల ఊరించే లక్ష్యం నిలిచింది. ఈ టార్గెట్‌ను చేజ్‌ చేయడానికి పాక్‌ శాయశక్తులా ప్రయత్నించింది.

ఒక దశలో 83 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. సాద్‌ షకీల్‌, ఇమాముల్‌ హక్ నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించి పాక్‌కు విజయంపై ఆశలు రేకెత్తించారు. నాలుగో పాక్‌ ఓవర్‌నైట్‌ స్కోరు 4 వికెట్లకు 198 రన్స్‌తో బరిలోకి దిగింది. లంచ్‌ సమయానికి మరో మూడు వికెట్లు కోల్పోయి 291 రన్స్‌ చేసింది. రెండో సెషన్‌లో పాక్‌ మిగిలిన మూడు వికెట్లను త్వరగానే కోల్పోయింది.

WhatsApp channel