తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 కోసం టీమ్స్‌ రిటెయిన్‌ చేసుకున్న ప్లేయర్స్‌లో ఎవరికెంత?

IPL 2022 కోసం టీమ్స్‌ రిటెయిన్‌ చేసుకున్న ప్లేయర్స్‌లో ఎవరికెంత?

Hari Prasad S HT Telugu

22 December 2021, 9:45 IST

    • IPL 2022.. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఎమ్మెస్‌ ధోనీలాంటి స్టార్‌ ప్లేయర్స్‌ అవే ఫ్రాంఛైజీలకు ఆడబోతున్నారు. లీగ్‌లోకి మరో రెండు కొత్త టీమ్స్‌ రావడంతో మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో టీమ్‌కు గరిష్ఠంగా నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఐపీఎల్ ట్రోఫీ
ఐపీఎల్ ట్రోఫీ (ANI)

ఐపీఎల్ ట్రోఫీ

IPL 2022 కోసం లీగ్‌లోని 8 పాత టీమ్స్‌ మొత్తం 27 మంది ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకున్నాయి. వచ్చే ఏడాది మెగా వేలం జరగబోతున్న నేపథ్యంలో నవంబర్ 30 వరకు ఇచ్చిన గడువులోపు తాము రిటెయిన్ చేసుకోబోతున్న ప్లేయర్స్‌ను ఆయా ఫ్రాంఛైజీలు ప్రకటించాయి. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, ఎమ్మెస్‌ ధోనీలాంటి స్టార్‌ ప్లేయర్స్‌ అవే ఫ్రాంఛైజీలకు ఆడబోతున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

లీగ్‌లోకి మరో రెండు కొత్త టీమ్స్‌ రావడంతో మెగా వేలం నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో టీమ్‌కు గరిష్ఠంగా నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకునే అవకాశం కల్పించారు. మరి ఏ టీమ్‌ ఏ ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకుంది? వాళ్లకు వచ్చే సీజన్‌లో లభించబోయే మొత్తం ఎంత? అన్నది ఇప్పుడు చూద్దాం.

చెన్నై సూపర్‌ కింగ్స్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొత్తం నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకుంది. అయితే తమ మొదటి ప్లేయర్‌గా ధోనీకి బదులు జడేజాను ఎంచుకోవడం విశేషం. దీంతో జడేజాకు రూ. 16 కోట్లు దక్కనుండగా.. ధోనీకి రూ. 12 కోట్లు, ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి రూ. 8 కోట్లు, ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు రూ. 6 కోట్లు అందనున్నాయి. వీళ్లకు ఇచ్చింది పోగా.. వేలంలో కొనడానికి సీఎస్కే దగ్గర ఇంకా రూ. 48 కోట్లు ఉన్నాయి.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

అటు 2021 రన్నరప్‌ టీమ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కూడా నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో ఆండ్రీ రసెల్‌ (రూ. 12 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 8 కోట్లు), స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి (రూ. 8 కోట్లు), ఆల్‌రౌండర్‌ సునీల్ నరైన్‌ (రూ. 6 కోట్లు) కేకేఆర్‌ టీమ్‌తోనే ఉండనున్నారు. ప్రస్తుతం ఈ టీమ్‌ దగ్గర కూడా వేలంలో రూ. 48 కోట్లు అందుబాటులో ఉండనున్నాయి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ కేవలం ముగ్గురు ప్లేయర్స్‌నే రిటెయిన్ చేసుకుంది. టీమ్‌లోని స్టార్‌ ప్లేయర్స్‌ అయిన డేవిడ్‌ వార్నర్‌, రషీద్‌ ఖాన్‌, జానీ బెయిర్‌స్టో, జేసన్‌ హోల్డర్‌, జేసన్‌ రాయ్‌లను వదిలేయడం గమనార్హం. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు) తో పాటు ఇద్దరు అన్‌క్యాప్డ్‌ ఇండియన్‌ ప్లేయర్స్‌ అబ్దుల్‌ సమద్‌ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మాలిక్‌ (రూ. 4 కోట్లు)లు కూడా సన్‌రైజర్స్‌ టీమ్‌తోనే ఉండనున్నారు. వీళ్లుపోగా హైదరాబాద్‌ టీమ్‌ దగ్గర వేలంలో కొనుగోలు చేయడానికి రూ. 68 కోట్లు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్‌

ఊహించినట్లే ముంబై ఇండియన్స్‌ టీమ్‌ రోహిత్‌ శర్మ (రూ.16 కోట్లు), జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)లను రిటెయిన్ చేసుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ను మాత్రం ఆ టీమ్‌ వదిలేసింది. ముంబై ఇండియన్స్‌ టీమ్‌ దగ్గర ప్రస్తుతం రూ. 48 కోట్లు ఉన్నాయి.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు) మాత్రం ఆ టీమ్‌తోనే కొనసాగనున్నాడు. అతనితోపాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహ్మద్‌ సిరాజ్‌(రూ. 8 కోట్లు)లు టీమ్‌తో కొనసాగనున్నారు. 2021 సీజన్‌లో పర్పుల్‌క్యాప్‌ గెలిచిన హర్షల్‌ పటేల్‌ను టీమ్‌ వదిలేసింది. ప్రస్తుతం వేలంలో కొనుగోలు చేయడానికి ఆర్సీబీ దగ్గర రూ. 57 కోట్లు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌

అటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ కూడా నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌లాంటి స్టార్లను వదిలేసిన ఢిల్లీ.. రిషబ్‌ పంత్‌ (రూ. 16 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), అక్షర్‌ పటేల్‌ (రూ. 9 కోట్లు), ఎన్రిచ్‌ నోక్యా (రూ. 6.5 కోట్లు)లను రిటెయిన్ చేసుకుంటున్నట్లు చెప్పింది. ఆ టీమ్‌ దగ్గర ఇంకా రూ. 47.5 కోట్లు ఉన్నాయి.

రాజస్థాన్‌ రాయల్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌ ముగ్గురు ప్లేయర్స్‌నే రిటెయిన్ చేసుకుంది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (రూ. 14 కోట్లు), జోస్‌ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైశ్వాల్‌ (రూ. 4 కోట్లు) రాయల్స్ టీమ్‌తోనే ఉండనున్నారు. ఆ టీమ్‌ దగ్గర ఇంకా రూ. 62 కోట్లు ఉన్నాయి.

పంజాబ్‌ కింగ్స్‌

స్టార్‌ బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను పంజాబ్‌ కింగ్స్‌ టీమ్‌ వదిలేయడం ఆశ్చర్యం కలిగించేదే. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (రూ. 12 కోట్లు) మాత్రం ఆ టీమ్‌తోనే ఉండనున్నాడు. పేస్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (రూ. 4 కోట్లు)ను కూడా రిటెయిన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పంజాబ్‌ కింగ్స్ టీమ్‌ దగ్గర ఇంకా రూ. 72 కోట్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం