తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Teams | ఐపీఎల్‌లో మోస్ట్‌ పాపులర్‌ టీమ్స్‌ ఇవే

IPL Teams | ఐపీఎల్‌లో మోస్ట్‌ పాపులర్‌ టీమ్స్‌ ఇవే

Hari Prasad S HT Telugu

02 February 2022, 17:55 IST

google News
    • IPL Teams.. సోషల్‌ మీడియా యుగంలో ఏ వ్యక్తి అయినా, టీమ్‌ అయినా పాపులర్‌ అయ్యారని ఎలా చెబుతాం? వారికున్న ఫాలోవర్లను బట్టే కదా. అలాగే ఐపీఎల్‌లో కూడా పాపులర్‌ టీమ్స్‌ను సోషల్‌ మీడియాలో వాటికున్న ఫాలోవర్లను బట్టే తేల్చేది. టీమ్స్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాయి.
2021 ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్
2021 ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (PTI)

2021 ఐపీఎల్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్

IPL Teamఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో పాపులర్‌ టీమ్స్‌ ఏవి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అసలు పాపులర్‌ టీమ్స్‌ అంటే ఏంటి? వీటికి కొలమానం ఏంటి? అన్న సందేహాలు రావడం సహజం. ఈ సోషల్‌ మీడియా యుగంలో ఏ వ్యక్తి అయినా, టీమ్‌ అయినా పాపులర్‌ అయ్యారని ఎలా చెబుతాం? వారికున్న ఫాలోవర్లను బట్టే కదా. అలాగే ఐపీఎల్‌లో కూడా పాపులర్‌ టీమ్స్‌ను సోషల్‌ మీడియాలో వాటికున్న ఫాలోవర్లను బట్టే తేల్చేది. 

ఈ లీగ్‌లో అన్ని టీమ్స్‌ తమ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లాంటి సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాయి. ఆయా టీమ్స్‌, అందులోని ప్లేయర్స్‌, లీగ్‌లో వాటి సక్సెస్‌ రేటును బట్టి ఈ టీమ్స్‌ను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య కూడా వేరుగా ఉంటుంది. కొత్తగా వచ్చే ఏడాది నుంచి రానున్న 2 టీమ్స్‌ను వదిలేస్తే.. 14 ఏళ్లుగా లీగ్‌లో ఉన్న 8 టీమ్స్‌కు సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌ ఎలా ఉంది? (నవంబర్‌ 22, 2021 నాటికి) పాపులారిటీలో ఏ టీమ్‌ ఏ స్థానంలో ఉందో ఇప్పుడు చూద్దాం.

ముంబై ఇండియన్స్‌

ఐపీఎల్‌ మొదటి సీజన్‌లో ఈ టీమ్‌ను అత్యధిక ధరకు కొనుగోలు చేశారు భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ. అందుకు తగినట్లే అత్యధిక టైటిల్స్‌ (5), పాపులారిటీ కూడా ముంబై ఇండియన్స్‌దే కావడం విశేషం. ఫ్యాన్స్‌తో ఎంగేజ్‌ అవడంలోనూ ఈ టీమ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో ఏ ఇతర ఐపీఎల్‌ టీమ్‌కు లేనంత మంది ఫాలోవర్లు ముంబై ఇండియన్స్‌కు ఉన్నారు. రోహిత్‌శర్మ, బుమ్రా, పాండ్యా బ్రదర్స్‌, పొలార్డ్‌లాంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్న ఈ టీమ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 82 లక్షల మంది  ఫాలో అవుతున్నారు. ఇక ట్విటర్‌లో 70 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో కోటి 37 లక్షల మంది ఫాలోవర్లు ముంబై టీమ్‌కు ఉన్నారు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌

ముంబై ఇండియన్స్‌ తర్వాత మూడు టైటిల్స్‌తో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సోషల్‌ మీడియా ఫాలోవర్ల విషయంలోనూ అదే స్థానంలో ఉంది. ఈ టీమ్‌కు అతి పెద్ద బలం ధోనీయే. అతని పాపులారిటీ చెన్నై టీమ్‌కు ఎంతగానో ఉపయోగపడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ అయిన సీఎస్కే టీమ్‌లో రైనా, జడేజా, మోయిన్‌ అలీలాంటి స్టార్‌ ప్లేయర్స్‌ కూడా ఉన్నారు. ఈ టీమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 90 లక్షల మంది, ట్విటర్‌లో 78 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో కోటి 30 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ టీమ్‌ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇప్పటి వరకూ రెండుసార్లు టైటిల్ గెలిచింది. అతనికున్న ఫాలోయింగే టీమ్‌కు ప్లస్‌ పాయింట్‌. ఈ టీమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 28 లక్షల మంది, ట్విటర్‌లో 46 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో కోటి 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవకపోయినా.. 2021 సీజన్‌ వరకూ కెప్టెన్‌గా ఉన్న విరాట్‌ కోహ్లి చరిష్మా టీమ్‌కు ఉపయోగపడింది. డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌ వంటి ప్లేయర్స్‌ కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. ఆర్సీబీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 76 లక్షల మంది, ట్విటర్‌లో 52 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 98 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

పంజాబ్‌ కింగ్స్‌

బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా సహ యజమానిగా ఉన్న టీమ్‌ ఇది. అయితే ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేకపోయింది. 2021 సీజన్‌ నుంచే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌గా ఉన్న పేరును పంజాబ్‌ కింగ్స్‌గా మార్చడంతోపాటు టీమ్‌లోనూ భారీ మార్పులు చేసింది. ఈ టీమ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 24 లక్షల మంది, ట్విటర్‌లో 26 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 86 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చుకొని, యువ క్రికెటర్లతో టీమ్‌ను నింపిన తర్వాత ఈ టీమ్‌ ప్రదర్శన చాలా మెరుగైంది. 2020లో ఫైనల్‌ కూడా చేరింది. రిషబ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, శిఖర్‌ ధావన్‌లాంటి ప్లేయర్స్‌ ఈ టీమ్‌ బలం. గత రెండు సీజన్లుగా ఈ టీమ్‌ పాపులరిటీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 29 లక్షల మంది, ట్విటర్‌లో 21 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 77 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలో 2016లో టైటిల్‌ గెలిచింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. 2021లో తప్ప మిగతా అన్ని సీజన్లలో నిలకడగా ఆడుతున్న టీమ్‌ ఇది. ఈ టీమ్‌కు కూడా ఫ్యాన్‌బేస్‌ బాగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 లక్షల మంది, ట్విటర్‌లో 28 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 61 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

రాజస్థాన్‌ రాయల్స్‌

ఐపీఎల్‌లో తొలి సీజన్‌నే గెలిచి సంచలనం సృష్టించిన రాజస్థాన్‌ రాయల్స్‌.. ఆ తర్వాత పెద్దగా రాణించిందేమీ లేదు. ప్రతి వేలంలో టీమ్‌లో ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తూ వస్తున్నా.. ఫలితంలో మార్పు లేదు. ఫ్యాన్‌బేస్‌లో అన్నింటికన్నా చివరి స్థానంలో ఉందీ టీమ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షల మంది, ట్విటర్‌లో 18 లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 48 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

 

తదుపరి వ్యాసం