తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rain Affect On India Vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం సూచన.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rain Affect on India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం సూచన.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

22 October 2022, 18:49 IST

google News
    • Rain Affect on India vs Pakistan: ఆదివారం నాడు మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ సూపర్ -12 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి (BCCI Twitter)

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

Rain Affect on India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ 2022లో అసలు సిసలు మజా ఆదివారం నాడు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా గతేడాది జరిగిన పరాజయానికి సరైన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరోపక్క బాబర్ ఆజం కెప్టెన్సీలో పాక్ జట్టు కూడా బలంగా కనిపిస్తుంది. ఫలితంగా ఈ మ్యాచ్ ఫుల్ ఉత్కంఠను కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇందుకు వరణుడు అడ్డు తగిలే అవకాశముంది.

మ్యాచ్‌కు కొన్ని గంటలే సమయముండటంతో ఇప్పటికే భారీ టికెట్లు బుక్కయ్యాయి. మెల్‌బోర్న్‌లో వాతావరణం మాత్రం మ్యాచ్‌కు అనుకూలించేలా లేదు. వాతావరణ శాఖ కూడా ఆదివారం వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. సాయంత్రానికి ఆటకు అంతరాయం కలిగించేందుకు చిన్నపాటి వర్షపు జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడాస్పందించాడు. తాము పూర్తి మ్యాచ్ ఆడాలనే అనుకుంటున్నామని, 40 ఓవర్ల జరగాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. "నేను నిద్ర లేచిన తర్వాత చూస్తే.. పక్కనున్న భవనాలపై నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది. ఇప్పుడు ఎండ ఉంది. మేము 40 ఓవర్ల ఆట ఆడాలని కోరుకుంటున్నాం. అదృష్టవశాత్తూ ఇటీవలే భారత్‌తో ఆస్ట్రేలియాపై కనీసం 8 ఓవర్ల గేమ్ ఆడాము. ఆదివారం నాడు మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశముందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ నుంచి వచ్చిన డేటా చెబుతోంది. రోజు గడిచేకొద్ది వర్షం భారీగా ఉంటుందని సూచించింది. ఒకవేళ మ్యాచ్ సాధ్యం కాకపోతే ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా నిరాశను కలిగిస్తుంది" అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

గత 12 నెలల్లో టీమిండియా ఎలా సన్నద్ధమైందో రోహిత్ శర్మ వివరించాడు. ఈ సమయంలోతమ సన్నద్ధత, ఆలోచనా విధానంలో జరిగిన మార్పుల గురించి తెలియజేశారు. నిర్భయంగా గేమ్ ఆడాలని, జట్టంతా మంచి ప్రదర్శన చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

తదుపరి వ్యాసం