తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Aus Vs Nz T20 World Cup : దంచికొట్టిన కాన్వే, అలెన్ - ఆస్ట్రేలియా టార్గెట్ 201

Aus vs Nz T20 World Cup : దంచికొట్టిన కాన్వే, అలెన్ - ఆస్ట్రేలియా టార్గెట్ 201

22 October 2022, 14:39 IST

  • Aus vs Nz T20 World Cup :టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సూప‌ర్ 12లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 200 ర‌న్స్ చేసింది. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ విధించింది

డెవ‌న్ కాన్వే
డెవ‌న్ కాన్వే

డెవ‌న్ కాన్వే

Aus vs Nz T20 World Cup : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ సూప‌ర్ 12 లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్ చెల‌రేగారు. ఓపెన‌ర్లు కాన్వే (92 ప‌రుగులు), ఫిన్ అలెన్ (42 ర‌న్స్) బ్యాటింగ్ మెరుపుల‌తో న్యూజిలాండ్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 200 ర‌న్స్ చేసింది. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌ను కాన్వే, అలెన్ బెంబేలెత్తించారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అలెన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ నాలుగు ఓవ‌ర్ల‌లోనే యాభై ప‌రుగులు చేసింది. 16 బాల్స్‌లోనే మూడు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌లో అలెన్ 42 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. అలెన్ ఔట‌యినా కాన్వే మాత్రం జోరు త‌గ్గించ‌లేదు. కెప్టెన్ విలియ‌మ్స‌న్ 23 బాల్స్‌లో 23 ర న్స్ చేసి నిరాశ‌ప‌రిచాడు.

గ్లెన్ ఫిలిప్స్ కూడా త‌క్కువ స్కోరుకే ఔట‌య్యాడు. చివ‌ర‌లో నీష‌మ్ అండ‌తో కాన్వే న్యూజిలాండ్‌కు భారీ స్కోరు సాధించి పెట్టాడు. 58 బాల్స్‌లో రెండు సిక్స‌ర్లు, ఏడు ఫోర్ల‌తో కాన్వే 92 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. తృటిలో సెంచ‌రీ మిస్ అయ్యాడు. నీష‌మ్ 13 బాల్స్‌లో రెండు సిక్స‌ర్ల‌తో 26 ర‌న్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో హేజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు ద‌క్కాయి.

తదుపరి వ్యాసం