Suresh Raina Comments on T20 World Cup: పాక్‌పై భారత్ గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ మనదే.. రైనా కామెంట్స్-suresh raina shocking comments on t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suresh Raina Comments On T20 World Cup: పాక్‌పై భారత్ గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ మనదే.. రైనా కామెంట్స్

Suresh Raina Comments on T20 World Cup: పాక్‌పై భారత్ గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ మనదే.. రైనా కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Oct 18, 2022 12:12 PM IST

Suresh Raina Comments on T20 World Cup: టీ20 వరల్డ్ కప్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి మ్యాచ్ పాకిస్థాన్‌పై గెలిస్తే.. టీ20 వరల్డ్ కప్ కచ్చితంగా గెలుస్తుందని స్పష్టం చేశాడు.

టీమిండియా
టీమిండియా (PTI)

Suresh Raina Comments on T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ సమరం ప్రారంభమైంది. సూపర్-12 దశకు చేరుకోడానికి జట్లన్నీ తమ వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్టోబరు 23న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక కానుంది. ఈ మ్యాచ్‌ కోసం భారత అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇండియా-పాకిస్థాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో గెలిస్తే టీ20 వరల్డ్ కప్ టీమిండియానే గెలుస్తుందని రైనా స్పష్టం చేశాడు. "ఓపెనింగ్ గేమ్ పాకిస్థాన్‌పై టీమిండియా గెలిచిందంటే కచ్చితంగా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది. ఎందుకంటే టీమ్ పటిష్ఠంగా ఉంది. బుమ్రా స్థానాన్ని షమీ భర్తీ చేశాడు. అతడిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. అర్ష్‌దీప్ సింగ్ లాంటి యువ సామర్థ్యానికి లోటు లేదు. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ వారు మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ గొప్ప లీడర్. మనం తొలి మ్యాచ్ గెలిస్తే.. అది బాగా కలిసొచ్చే అంశం. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌లో గెలవాలని పూజలు చేస్తున్నారు. నేను కూడా టీమిండియా వరల్డ్ కప్ గెలవాలని చూస్తున్నాను." అని సురేష్ రైనా స్పష్టం చేశాడు.

దినేశ్ కార్తీక్-రిషభ్ పంత్ ఇద్దరిలో ఎవర్ని తుదిజట్టులో తీసుకుంటే బాగుంటుందనే ప్రశ్నకు సురేష్ రైనా ఆసక్తికర సమాధానమిచ్చాడు. "దినేశ్ కార్తిక్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మెరుగ్గా ప్రదర్శన చేస్తున్నాడు. అయితే రిషభ్ పంత్‌లో ఓ ప్రత్యేకత ఉంది. అతడు ఎడం చేతి వాటం బ్యాటర్. అది బాగా కలిసొస్తుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో గౌతమ్ గంభీర్ ఎలా రాణించాడో చూశాం. యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు తిలకించాం. ఆ తర్వాత 2011 ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆ విజయంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఎడం చేతి వాటం బ్యాటర్లు ఇలాంటప్పుడు ముఖ్య పాత్రలు పోషించారు. కాబట్టి మీకు ఆ ప్రయోజనం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పంత్‌కు ఆరు బంతులకు ఆరు సిక్సర్లు ఎలా కొట్టాలో బాగా తెలుసు." అని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.

వరల్డ్ కప్‌కు రవీంద్ర జడేజా దూరం కావడంపై సురేష్ రైనా స్పందించాడు. జట్టులో తాను బాగా మిస్ అవుతుంది అతడినేనని, ముఖ్యంగా అతడి ఫీల్డింగ్‌ను బాగా మిస్ అవుతున్నట్లు స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌లో అతడు గేమ్ ఛేంజర్ అని, కీలక పరుగులను కట్టడి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం