తెలుగు న్యూస్  /  Sports  /  Hardik And Stokes Who Is The Best All Rounder To Be Jacques Kallis Says Interesting Answer

Hardik vs Stokes Best All rounder: హార్దిక్-స్టోక్స్‌ ఇద్దరిలో బెస్ట్ ఆల్ రౌండర్ ఎవరు? కల్లీస్ ఆసక్తికర సమాధానం

01 October 2022, 16:00 IST

    • Kallis told Who is Better All Rounder: ప్రస్తుతం అత్యుత్తమ ఆల్‌రౌండర్లుగా గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్య, బెన్ స్టోక్స్‌లో బెస్ట్ ఎవరు? అనే ప్రశ్నకు కల్లీస్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇద్దరూ తమ తమ జట్లలో కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు.
హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (ANI)

హార్దిక్ పాండ్య

Jaques Kallis About All rounders: ప్రపచంలో ఆల్ టైమ్ బెస్ట్ ఆల్ రౌండర్లలో దక్షిణాఫ్రికా క్రికెటర్ జాకస్ కల్లీస్ ముందు వరుసలో ఉంటాడు. 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందుకున్న కల్లీస్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 25,534 పరుగులు చేశాడు. ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్న ఈ దిగ్గజం ప్లేయర్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం అత్యుత్తమ ఆల్‌రౌండర్లుగా గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పాండ్య, బెన్ స్టోక్స్‌లో బెస్ట్ ఎవరు? అనే ప్రశ్నకు కల్లీస్ ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

"హార్దిక్, స్టోక్స్ ఇద్దరూ ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లు. ప్రతి ఒక్కరి దృష్టి వారిపై కచ్చితంగా ఉంటుంది. ఇద్దరిలో ఎవరికి వారు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఇద్దరూ మెరుగ్గా రాణిస్తున్నారని కచ్చితంగా అనుకుంటున్నాను. వీరిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నా" అని కల్లీస్ అభిప్రాయపడ్డాడు.

"ఈ నెలలో రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు భారత్, దక్షిణాఫ్రికా రెండింటిలో ఏ జట్టుకు అవకాశముందనే ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చాడు కల్లీస్. భారత్, దక్షిణాప్రికా రెండు జట్లు టీ20 వరల్డ్ కప్‌లో బాగా రాణిస్తాయని అనుకుంటున్నాను. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ ఈ రెండు జట్ల మధ్య జరగుతున్న టీ20 సిరీస్ కీలకం కానుంది. ఈ రెండు జట్లు ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే శ్రమతో పాటు అదృష్టం కూడా కాస్త కలిసిరావాలి" అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం భారత్.. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడుతోంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. గువహటి వేదికగా రెండో టీ20 ఆదివారం నాడు జరగనుంది. ఇక మూడోది ఇండోర్ వేదికగా అక్టోబరు 4వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సిరీస్ తర్వాత ప్రొటీస్ జట్టుతోనే మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఈ సిరీస్ అక్టోబరు నుంచి అక్టోబరు 11 వరకు జరగనుంది.