Ross Taylor on Ben Stokes: స్టోక్స్ న్యూజిలాండ్ టీమ్‌కు ఆడతా అన్నాడు.. కానీ..!
Ross Taylor on Ben Stokes: ఇప్పుడు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న బెన్ స్టోక్స్, మూడేళ్ల కిందట న్యూజిలాండ్ టీమ్‌కు వరల్డ్‌కప్ దూరం చేసిన ఇదే బెన్ స్టోక్స్.. అదే టీమ్‌కు ఆడటానికి సిద్ధపడ్డాడట. ఈ విషయాన్ని తన తాజా బుక్‌లో న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ రాస్ టేలర్ వెల్లడించాడు.
వెల్లింగ్టన్: ఒక దేశంలో పుట్టిన క్రికెటర్ మరో దేశానికి ఆడటం చూశాం. ఒకే ప్లేయర్ రెండు దేశాలకు ఆడటమూ చూశాం. అలాగే ఇప్పుడు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఉండటంతో ఆ టీమ్ తొలిసారి విశ్వవిజేతగా నిలవడానికి ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్ కూడా ఒకప్పుడు న్యూజిలాండ్ టీమ్‌కు ఆడాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని తన తాజా బుక్ బ్లాక్ & వైట్ లో రాస్ టేలర్ వెల్లడించాడు.
2010లో స్టోక్స్ తనతోపాటు డర్హమ్ టీమ్‌కు ఆడుతున్న సమయంలో న్యూజిలాండ్‌కు ఆడతావా అని తాను అడిగినట్లు టేలర్ చెప్పాడు. దానికి స్టోక్స్ చాలానే ఆసక్తి చూపినా.. అప్పటి న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ నిర్ణయం కారణంగా ఆ అవకాశాన్ని అతడు కోల్పోయాడు. స్టోక్స్ ఆసక్తిని తాను అప్పటి న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో జస్టిన్ వాన్‌కు చెప్పినట్లు టేలర్ తెలిపాడు.
"అతడు 18 లేదా 19 ఏళ్ల వయసుంటాడు. అతడు ఓ కివీ కూడా. దీంతో న్యూజిలాండ్ వచ్చి తమ టీమ్‌కు ఆడతావా అని అడిగాను. అతడు ఓకే అనడంతో నేను సీఈవో జస్టిన్ వాన్‌కు మెసేజ్ చేశాను. కానీ వాన్ మాత్రం స్టోక్స్ న్యూజిలాండ్ వచ్చి మళ్లీ డొమెస్టిక్ క్రికెట్‌లో నిరూపించుకున్న తర్వాతే నేషనల్ టీమ్‌కు ఎంపిక చేస్తామని చెప్పారు. ఇటు స్టోక్స్‌కు మాత్రం మనం అంతకంటే ఎక్కువ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుందని అన్నాను. కానీ అది సాధ్యం కాలేదు" అని టేలర్ తన బుక్‌లో చెప్పాడు.
న్యూజిలాండ్‌కు ఆడటానికి స్టోక్స్ సిన్సియర్‌గా ఓకే చెప్పాడని కూడా టేలర్ వెల్లడించాడు. ఆ సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ వేగంగా నిర్ణయాలు తీసుకొని, అతనికి కచ్చితమైన హామీ ఇచ్చి ఉండాల్సిందని, కానీ అలా జరగలేదని టేలర్ అన్నాడు. దీంతో స్టోక్స్ ఇంగ్లండ్‌కు ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆ టీమ్‌తోపాటు ప్రపంచంలోని బెస్ట్ ఆల్‌రౌండర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. 2011లో తొలిసారి ఇంగ్లండ్ టీమ్‌లోకి వచ్చిన అతడు.. ఇప్పుడు టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా ఎదిగాడు. ఈ మధ్యే వన్డేల నుంచి రిటైరయ్యాడు.
టాపిక్