Hardik Pandya in ICC Rankings: హార్దిక్ పాండ్యాకు కెరీర్ బెస్ట్ ర్యాంక్-hardik pandya moved to career best in latest icc rankings ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya Moved To Career Best In Latest Icc Rankings

Hardik Pandya in ICC Rankings: హార్దిక్ పాండ్యాకు కెరీర్ బెస్ట్ ర్యాంక్

Hari Prasad S HT Telugu
Aug 31, 2022 05:05 PM IST

Hardik Pandya in ICC Rankings: హార్దిక్ పాండ్యా లేటెస్ట్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన మెరుపులతో టీమ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (AP)

Hardik Pandya in ICC Rankings: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం నుంచి కోలుకొని టీమ్‌లోకి తిరిగి వచ్చినప్పటి నుంచీ చెలరేగుతున్నాడు. తాజాగా ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే తన విశ్వరూపం చూపించాడు. ఆల్‌రౌండర్‌ అన్న పదానికి సరైన న్యాయం చేస్తూ బౌలింగ్‌లో మూడు కీలకమైన వికెట్లు తీయడంతోపాటు చేజింగ్‌లో 33 రన్స్‌తో టీమ్‌ను గెలిపించాడు. చివరి ఓవర్లో తీవ్ర ఒత్తిడిలోనూ ఎంతో కూల్‌గా విన్నింగ్ సిక్స్‌ కొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌తో తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌లో నిలిచాడు. హార్దిక్‌ గతంలో ఎప్పుడూ ఇంత బెస్ట్‌ ర్యాంక్‌ సాధించలేదు. మరోవైపు ఇదే ఆసియా కప్‌లో చెలరేగుతున్న ఆఫ్ఘనిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ కూడా తాజా బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో రెండుస్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రేజ్‌ షంసి రెండో స్థానంలో, ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన మరో ఆఫ్ఘన్‌ బౌలర్‌ ముజీబుర్‌ రెహమాన్‌ కూడా టాప్‌10లోకి వచ్చాడు. అతడు ఏడు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు పాకిస్థాన్‌పై 4 వికెట్లు తీసిన భువనేశ్వర్‌ కుమార్‌ 8వ స్థానంలో ఉన్నాడు.

ఇక బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 2లో పాకిస్థాన్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ ఉండటం విశేషం. తాజా ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్‌ ఒక స్థానం మెరుగుపరచుకొని రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అటు ఆఫ్ఘన్‌ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ 14వ ర్యాంక్‌కు, గుర్బాజ్‌ 29వ స్థానానికి చేరుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం