Hardik on India vs Pakistan: నరాలు ఉప్పొంగాయి.. వాటిని చెక్ చేసుకున్నాను..-hardik pandya says nerves are checked facing challenges pakistan in asia cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik On India Vs Pakistan: నరాలు ఉప్పొంగాయి.. వాటిని చెక్ చేసుకున్నాను..

Hardik on India vs Pakistan: నరాలు ఉప్పొంగాయి.. వాటిని చెక్ చేసుకున్నాను..

Maragani Govardhan HT Telugu
Aug 30, 2022 10:37 AM IST

Hardik reaction on Match against Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. పాక్‌తో ఆడుతున్నప్పుడు తమ నరాలు ఉప్పొంగాయని, మేము చెక్ చేసుకున్నామని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

హార్దిక్ పాండ్య
హార్దిక్ పాండ్య (AP)

Hardik reaction on Match against Pakistan: ఇటీవల కాలంలో టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ హార్దిక్ వన్ మ్యాన్ షోతో భారత్‌కు అసాధారణ విజయాలను అందిస్తున్నాడు.ఆదివారం నాడు దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మూడు అదిరిపోయే వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ చివర్లో మెరుపులు మెరిపించి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అతడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

"ముందుగా ఈ మ్యాచ్‌లో గెలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయం మాకు ఎంతో ముఖ్యం. మా నరాలను చెక్ చేసుకున్నాం. ఉత్కంఠతో ఉప్పొంగాయి. జట్టుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొని వాటిని అధిగమించాం. ఈ మ్యాచ్‌లో జడేజా ఆడిన విధానం నాకు నచ్చింది. జడ్డూ నేను 7 నుంచి 8 ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం." అని హార్దిక్ పాండ్య తెలిపాడు.

"భారత జట్టు టాప్-3కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అవకాశాలు పొందుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రపంచకప్ ఆడేముందు అత్యధిక అవకాశాలను పొందడం ఆనందంగా ఉంది. కాబట్టి ఇదే విధంగా ముందుకు సాగుతాం. ఇలాంటి ఆటతీరునే ఇకపైనా ప్రదర్శిస్తాం. ఈ గేమ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది." అని హార్దిక్ స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 147 పరుగులకు ఆలౌటైంది. దాయాది జట్టులో మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ 4 వికెట్లు, హార్దిక్ 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనంలో టీమిండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. కోహ్లీ 35 పరుగులు చేయగా.. జడేజా 35, పాండ్య 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

WhatsApp channel

సంబంధిత కథనం