Virat Kohli Gift to Pakistan: పాక్ పేసర్‌కు టీమిండియా జెర్సీ ఇచ్చిన విరాట్
Virat Kohli Gift to Pakistan: పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్‌కు టీమిండియా జెర్సీ ఇచ్చాడు విరాట్ కోహ్లి. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
Virat Kohli Gift to Pakistan: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ ఇండియా, పాకిస్థాన్ ఫైట్‌లో ఉండే అసలైన మజాను అందించినా.. ప్లేయర్స్ మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.
మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ప్రాక్టీస్ సందర్భంగా ఒకరితో ఒకరు ఎంతో ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఇక మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనూ ఎవరూ అదుపు తప్పలేదు. పైగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌ను హార్దిక్ సరదాగా హగ్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ పేస్ బౌలర్ హరీస్ రవూఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు దేశాల అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
పాకిస్థాన్ ఫ్యాన్సే కాదు.. ఆ క్రికెట్ టీమ్‌లోనూ కోహ్లికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్లలో బౌలర్ రవూఫ్ కూడా ఒకడు. దీంతో మ్యాచ్ తర్వాత టీమిండియా జెర్సీ ఇవ్వాల్సిందిగా కోహ్లిని రవూఫ్ కోరాడు. దానికి అంగీకరించిన విరాట్.. జెర్సీపై తన ఆటోగ్రాఫ్ చేసి మరీ ఇచ్చాడు. ఆ జెర్సీ తీసుకొని రవూఫ్ చాలా ఖుషీగా కనిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది.
తన నంబర్ 18 జెర్సీనే విరాట్ అతనికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. విరాట్ ముందు రవూఫ్ ఓ సాధారణ అభిమానిలాగే ఉండటం విశేషం. అటు ఈ మ్యాచ్‌కు ముందు కూడా ఎంతో మంది పాకిస్థాన్ అభిమానులు విరాట్ కోహ్లితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. విరాట్ కూడా సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా వాళ్ల దగ్గరికి వెళ్లి మరీ ఫొటోలకు పోజులిచ్చాడు. అటు ప్రాక్టీస్ సందర్భంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కూడా విరాట్ కలిసి గ్రీట్ చేసిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. అతడు చేజింగ్‌లో కీలకమైన 35 రన్స్ చేశాడు. అయితే అతడు కాన్ఫిడెంట్‌గా ఆడిన షాట్లు చూస్తుంటే.. త్వరలోనే విరాట్ పూర్తిస్థాయి ఫామ్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా ఇండియా బుధవారం (ఆగస్ట్ 31) హాంకాంగ్‌తో తలపడనుంది.
సంబంధిత కథనం