Vijay Deverakonda - Virat Kohli: కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంద‌న్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌-vijay deverakonda says that he wants to act in virat kohli s biopic ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda Says That He Wants To Act In Virat Kohli's Biopic

Vijay Deverakonda - Virat Kohli: కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంద‌న్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 02:47 PM IST

Vijay Deverakonda - Virat Kohli:ఆదివారం జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌కు టాలీవుడ్ యువ‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాడు. వ‌సీం అక్ర‌మ్‌, ఇర్ఫాన్ ప‌ఠాన్‌ల‌తో క‌లిసి స్టేడియంలో సంద‌డి చేశాడు. ఈ సందర్భంగా ఏ క్రికెటర్ బయోపిక్ లో నటించాలనుందని ప్రీ మ్యాచ్ షోలో కామెంటేటర్స్ అడిగిన ప్రశ్నకు విజయ్ ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా...

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Instagram)

Vijay Deverakonda - Virat Kohli:ఆదివారం జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించేందుకు టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లాడు. మ్యాచ్ ఆద్యంతం ఇండియన్ ప్లేయర్స్ కు మద్దతు ఇస్తూ కనిపించాడు. అంతేకాకుండా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్ తో కలిసి స్టేడియంలో అడుగుపెట్టిన విజయ్ క్రికెట్ ఆటతో తనకున్న అనుభవాలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, వసీం అక్రమ్ మధ్య సాగిన సంభాషణ వైరల్ గా మారింది. ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్ లో నటించాలనుందని కామెంటేటర్స్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ధోనీ బ‌యోపిక్‌లో నటించాలనుకున్నా. కానీ ధోనీ జీవితంతో సుశాంత్ సింగ్ సినిమా చేశాడు.

ధోనీ కాకుండా కోహ్లి బయోపిక్ లో నటించాలనుంది. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా అని చెప్పాడు. విజయ్ సమాధానం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆకట్టుకుంటోంది. మ్యాచ్ లో అతడు కనిపించడంతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇటీవలే లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు ల‌వ్‌, యాక్ష‌న్ అంశాలను జోడించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

IPL_Entry_Point