Hardik Pandya: పాక్‌పై మెరుపు ఇన్నింగ్స్ వెన‌కున్న సీక్రెట్ రివీల్ చేసిన పాండ్య‌-hardik pandya reveals secret behind finishing the final over with massive six ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya: పాక్‌పై మెరుపు ఇన్నింగ్స్ వెన‌కున్న సీక్రెట్ రివీల్ చేసిన పాండ్య‌

Hardik Pandya: పాక్‌పై మెరుపు ఇన్నింగ్స్ వెన‌కున్న సీక్రెట్ రివీల్ చేసిన పాండ్య‌

HT Telugu Desk HT Telugu
Aug 29, 2022 07:20 AM IST

Hardik Pandya:పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో బాల్ తో పాటు బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు హార్దిక్ పాండ్య. తన సూపర్ ఇన్నింగ్ వెనకున్న సీక్రెట్ ను మ్యాచ్ అనంతరం పాండ్య వెల్లడించాడు.

హార్ధిక్ పాండ్య, దినేష్ కార్తిక్
హార్ధిక్ పాండ్య, దినేష్ కార్తిక్ (twitter)

Hardik Pandya:ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు హార్దిక్ పాండ్య.బౌలింగ్ లో మూడు వికెట్లు తీయడమే కాకుండా నాలుగు వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో బ్యాటింగ్ మెరుపులు మెరిపించి టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. కేవలం 17 బాల్స్ లోనే ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 33 రన్స్ చేశాడు.

నవాజ్ వేసిన చివరి ఓవర్ లో ఏడు పరుగులు అవసరమైన దశలో సిక్సర్ తో ఇండియాకు సూపర్ విక్టరీని అందించాడు. చివరి ఓవర్ లో సిక్సర్ కొట్టడం వెనకున్న సీక్రెట్ ను మ్యాచ్ అనంతరం పాండ్య వెల్లడించాడు. చివరి ఓవర్ లో బ్యాటర్ కంటే బౌలర్ పైనే రెండింతల ఒత్తిడి ఉంటుందని పాండ్య అన్నాడు. ఆ వాస్తవం తెలుసు కాబట్టే ఏడు ఓవర్లు కాదు పదిహేను ఓవర్లు ఉన్నాఛేదించడానికి రెడీ అయిపోయాను.

చివరి ఓవర్ ను స్పిన్నర్ నవాజ్ లేదా పేసర్ నసీమ్ లలో ఎవరో ఒకరు వేస్తారని ముందుగానే ఊహించానని, అందుకు తగినట్లుగానే తన బ్యాటింగ్ ను ప్లాన్ చేసుకున్నట్లు హార్దిక్ పాండ్య తెలిపాడు. మ్యాచ్ అనంతరం హార్డిక్ పాండ్యపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రీఎంట్రీ తర్వాత పాండ్య బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా చక్కగా రాణిస్తున్నాడని అన్నాడు.

ప్రస్తుతం 140 కిమీ వేగంతో సులభంగా బౌలింగ్ చేయగలుగుతున్నాడని పేర్కొన్నాడు. ఇంతకుముందు కంటే చాలా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నాడు. పాక్ కెప్టెన్ అజామ్ కూడా పాండ్య ఆల్ రౌండర్ గా చక్కగా రాణించాడని పేర్కొన్నాడు. అతడి బౌలింగ్ తో పాటు ఆటను ముగించిన విధానం గొప్పగా ఉందని ప్రశంసలు కురిపించాడు.

WhatsApp channel