Gambhir on Kuldeep: ఇరు జట్లలో ప్రధాన వ్యత్యాసం కుల్దీప్ యాదవ్.. చైనామన్ బౌలర్‌పై గంభీర్ ప్రశంసలు
12 January 2023, 22:24 IST
- Gambhir on Kuldeep: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడని తెలిపాడుు. భారత్-శ్రీలంక జట్లలో ప్రధాన వ్యత్యాసం కుల్దీప్ యాదవేనని తెలిపాడు.
కుల్దీప్ యాదవ్
Gambhir on Kuldeep: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనంలో కేఎల్ రాహుల్(64) అర్ధశతకంతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ విజయంపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
"కుల్దీప్ యాదవ్ అసాధారణంగా ఆడాడు. కేఎల్ రాహుల్ చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది చాలా ముఖ్యమైంది. అతడు టాపార్డర్‌లో ఏ విధంగా ఆడతాడో మనకు తెలుసు. కానీ ఇది మాత్రం నాకు ప్రత్యేకంగా అనిపించింది. తన అనుభవాన్ని ఉపయోగించి ఆడాడు. భారత్ 4 వికెట్లు కోల్పోయిన తర్వాత ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అవసరం." అని గంభీర్ స్పష్టం చేశాడు.
కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇరు జట్లలో ప్రధాన తేడా కుల్దీప్ యాదవ్ అని, అతడి వల్లే టీమిండియా విజయం సాధించిందని అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 51 పరుగులు సమర్పించి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. . 215 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని మరో 6 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్(64) అర్ధశతకంతో రాణించి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు.