Ind vs SL 2nd ODI: శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. రాణించిన రాహుల్.. ఓ మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ కైవసం
Ind vs SL 2nd ODI: ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఆరు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. కేఎల్ రాహుల్(64) అర్దశతకంతో ఆకట్టుకున్నాడు.
Ind vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. 215 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని మరో 6 ఓవర్లు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. భారత టాపార్డర్ బ్యాటర్లు విఫలమైన వేళ.. కేఎల్ రాహుల్(64) అర్ధశతకంతో రాణించి ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఫలితంగా టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు లహిరు కుమార, చమిక కరుణరత్నే చెరో 2 వికెట్లు పడగొట్టారు. కసున్ రజిత ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు.
216 లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభమేమ దక్కలేదు. ఐదో ఓవర్లోనే కెప్టెన్ రోహిత్ శర్మను(17) కరుణ రత్నే ఔట్ చేయగా.. ఆ తదుపరి ఓవర్‌లోనే మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను(21) లహిరు కుమార్ వెనక్కి పంపాడు. మరి కాసేపట్లోనే విరాట్ కోహ్లీని(4) కూడా అతడే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో స్కోరు కాసేపు స్కోరు వేగం మందగించింది. అనంతరం శ్రేయాస్ అయ్యర్(28), కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్న తరుణంలో భారత్‌కు మరో దెబ్బ తగిలింది. శ్రేయాస్ అయ్యర్‌ను కసున్ రజిత ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లోపడింది భారత్.
అలాంటి సమయంలో హార్దిక్-కేఎల్ రాహుల్ రాణించారు. వీరిద్దరూ ఆరంభంలో నిదానంగా ఆడి.. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచారు. చెత్త బంతులకు మాత్రమే షాట్లు కొట్టి పరుగులు తీస్తూ క్రీజులో పాతుకుపోయారు. ఫలితంగా వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడీని కరుణరత్నే విడదీశాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో హార్దిక్(36).. కుశాల్ మెండీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
మరోపక్క కేఎల్ రాహుల్ కూడా నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచాడు. టెయిలెండర్ల సాయంతో లక్ష్యానికి చేరువగా స్కోరును తీసుకెళ్లాడు. అక్షర్ పటేల్(21), కుల్దీప్ యాదవ్(10) సాయంతో తుది లక్ష్యాన్ని ఛేదించాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 43.2 ఓవర్లలో టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది.
సంబంధిత కథనం