తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 | గ్రౌండ్‌లోనే పుష్ప స్టెప్‌ వేసిన డేవిడ్‌ వార్నర్‌.. వీడియో వైరల్‌

IPL 2022 | గ్రౌండ్‌లోనే పుష్ప స్టెప్‌ వేసిన డేవిడ్‌ వార్నర్‌.. వీడియో వైరల్‌

Hari Prasad S HT Telugu

11 April 2022, 19:00 IST

    • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరఫున చాలా సీజన్ల పాటు ఆడిన డేవిడ్‌ వార్నర్‌.. తెలుగు సినిమాలకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాడు. మన హీరోల డైలాగులు, స్టెప్పులనే ఇన్‌స్టాలో ఫన్నీ వీడియోలుగా పోస్ట్‌ చేస్తూ ఉంటాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (PTI)

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్

ముంబై: డేవిడ్‌ వార్నర్‌.. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత బ్యాట్‌తో విధ్వంసం సృష్టించే ఈ ఆస్ట్రేలియా ఓపెనర్.. క్రీజులో లేనప్పుడు మాత్రం చాలా ఫన్నీగా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే వార్నర్‌.. ఎంతో మంది హీరోలను అనుకరిస్తూ చేసిన ఫన్నీ వీడియోలను అందులో పోస్ట్‌ చేస్తుంటాడు. ముఖ్యంగా గత సీజన్‌ వరకూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఆడిన వార్నర్‌.. తెలుగు సినిమాలను బాగా అలవాటు చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

తెలుగు ఫేమస్‌ హీరోల పాపులర్‌ డైలాగులు చెప్పడం, పాటలకు స్టెప్పులేయడం అలవాటుగా మార్చుకున్నాడు. అలాంటి ఎన్నో వీడియోలను తన ఇన్‌స్టాలో వార్నర్‌ పోస్ట్‌ చేయడం గతంలో చూశాం. అయితే తాజాగా గ్రౌండ్‌లో ఓవైపు మ్యాచ్‌ జరుగుతున్న సమయంలోనే ఫీల్డింగ్‌ చేస్తూ పుష్ప మూవీలోని శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ వేసే స్టెప్పులేశాడు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్‌ చేస్తూ వార్నర్‌ వేసిన ఈ స్టెప్పులకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. స్టాండ్స్ లో ఉన్న వాళ్లెవరో ఈ వీడియో తీయగా.. దీనిని వార్నన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఎలా ఉంది? అని అడగడం విశేషం.

ఈ వెరైటీ స్టెప్పులు నిజంగా చాలా పాపులర్‌ అయ్యాయి. ఎంతోమంది బాలీవుడ్‌ స్టార్లు, క్రికెటర్లు ఇప్పటికే ఈ స్టెప్పులేశారు. ఆ మధ్య ఓ ఫుట్‌బాల్ ప్లేయర్‌ కూడా గోల్‌ చేసిన తర్వాత పుష్ప స్టెప్పులేయడం చూశాం. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వార్నర్‌ శ్రీవల్లి పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ బ్యాట్‌తోనూ రాణించాడు. 45 బంతుల్లోనే 61 రన్స్‌ చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 44 రన్స్‌ తేడాతో కోల్‌కతాను ఓడించింది.

టాపిక్

తదుపరి వ్యాసం